మండలిలో వైకాపా నేతల తీరుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. అప్రజాస్వామిక విధానాలపై చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరామన్నారు.
మండలి రద్దు తీర్మానం పంపినా వెంటనే అమల్లోకి రాదని ఈ సందర్భంగా యనమల అన్నారు. మండలి రద్దుకు సుదీర్ఘమైన ప్రక్రియ ఉందని తెలిపారు. ఆర్టికల్ 169 ప్రకారం తీర్మానం చేసే హక్కు మాత్రమే అసెంబ్లీకి ఉందన్నారు. కేంద్రం, పార్లమెంట్, రాష్ట్రపతి నుంచి ఉత్తర్వులు వచ్చేవరకు సమయం పడుతుందన్నారు. అసెంబ్లీ తీర్మానం పంపినా ఏడాదిపాటు మండలి జరుగుతుందన్నారు.
మండలి రద్దుపై తీర్మానం పంపినా సెలక్ట్ కమిటీ పని చేస్తుందని యనమల తెలిపారు. సెలక్ట్ కమిటీ అంటే ప్రభుత్వానికి ఎందుకంత భయమని యనమల ప్రశ్నించారు. నిపుణులు, ప్రజల అభిప్రాయాలను సెలక్ట్ కమిటీ తీసుకుంటుందని ఆయన అన్నారు.
ఇదీ చదవండి