ETV Bharat / city

'అదే జరిగితే... సగం ఏపీ కనిపించదు' - ఆంధ్రప్రదేశ్​లో వాటర్ మెన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్

శ్రీశైలం జలాశయం ప్రమాదంలో ఉందనీ... వెంటనే చర్యలు చేపట్టకపోతే సగం ఏపీ కనిపించకుండా పోతుందని.. వాటర్​మెన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ హెచ్చరించారు.

రాజేంద్రసింగ్
author img

By

Published : Nov 20, 2019, 8:02 PM IST

ఈటీవీభారత్​తో మాట్లాడుతున్న రాజేంద్రసింగ్

శ్రీశైలం జలాశయం ప్రమాదం ఉందని... వాటర్​మెన్ ఆఫ్ ఇండియా, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత రాజేంద్రసింగ్ హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే మరమ్మతులు చేయాలని సూచించారు. 'గంగాజల్ సాక్షారత్' యాత్రలో భాగంగా శ్రీశైలం డ్యాంను పరిశీలించిన ఆయన... అక్కడి అధికారులతో మాట్లాడారు. అనంతరం హైదరాబాద్ చేరుకున్నారు. శ్రీశైలం జలాశయం పరిస్థితి గురించి 'ఈటీవీ భారత్​'తో ప్రత్యేకంగా మాట్లాడారు.

శ్రీశైలం జలాశయంపై నీటి ఒత్తిడి ఎక్కువగా ఉందని... ఏదైనా విపత్తు సంభవిస్తే సగం ఆంధ్రప్రదేశ్ కనిపించకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు నదులపై రూ.కోట్లు ఖర్చు పెట్టి వంతెనలు నిర్మించేందుకు చూపిస్తున్న ఉత్సాహం... నిర్వహణలో చూపించడంలేదన్నారు. తక్షణమే ఏపీ ప్రభుత్వం శ్రీశైలం డ్యాంపై దృష్టిపెట్టి మరమ్మతులు చేయాలని సూచించారు.

ఇవీ చదవండి..

డిసెంబర్ నుంచి బోటు పర్యటకం ప్రారంభం

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.