ఏపీతో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ హైదరాబాద్ శాఖకు జేడీగా నియమించాలని.. ప్రధాని మోదీకి గత నెల 30న విజయసాయిరెడ్డి రాసిన లేఖకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ప్రతి లేఖ రాశారు. ఏపీతో సంబంధం లేని వ్యక్తిని సీబీఐ హైదరాబాద్ శాఖకు జేడీగా నియమించాలని విజయసాయిరెడ్డి లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖ ప్రతిని అమిత్ షా, రవిశంకర్ ప్రసాద్, సీబీఐ డైరెక్టర్‌కు పంపించారు. దీనికి స్పందించిన అమిత్‌షా ఇది తమ శాఖకు సంబంధం లేదని... సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరిధిలోకి రావడం వల్ల ఆ శాఖకు పంపుతున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి: