వాల్తేరు డివిజన్‌ను విశాఖ జోన్లో కొనసాగించాలని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. రాజ్యసభ జీరో అవర్‌లో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఎంతోకాలంగా ఉత్తరాంధ్ర ప్రజలు ఎదురుచూస్తున్న విశాఖ రైల్వే జోన్ కలను సాకారం చేస్తూ.. కేంద్రం సాధారణ ఎన్నికలకు ముందే నిర్ణయం వెలువరించింది. రాష్ట్ర విభజన జరిగిన ఐదేళ్ల తర్వాత.. తూర్పు కోస్తా రైల్వే జోన్‌ను ప్రకటించిన కేంద్రం.. ప్రధాన కార్యాలయం విశాఖలో ఉంటుందని ఉత్తర్వులు ఇచ్చింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న వాల్తేర్ డివిజన్‌ను రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ఇవీ చదవండి..