.
జగన్‌కు ఓట్లేసి మోసపోయాం: వైకాపా కార్యకర్తలు - వెలగపూడి రైతుల రిలే నిరాహారదీక్షలో వైకాపా కార్యకర్తలు న్యూస్
వెలగపూడి రైతుల రిలే నిరాహారదీక్షలో వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ కుమారుడని జగన్‌కు ఓట్లేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మించి మోసం చేయడం సీఎం జగన్‌కు తగదని అన్నారు. మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదని సూచించారు. తమ భూముల్లో కట్టిన భవనాల్లో ఎందుకు ప్రమాణ స్వీకారం చేశారని ప్రశ్నించారు. రాజధాని మారదని హామీ ఇచ్చిన ఆర్‌కే ఇప్పుడు ఎక్కడున్నారని అడిగారు. ప్రభుత్వ ప్రకటనతో తామూ దిక్కుతోచని స్థితిలో పడ్డామని వైకాపా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు.
velagapudi-ysrcp-drana-in-guntur
.