తుళ్లూరులో పోలీసుల తీరు ఉద్రిక్తతకు దారితీసింది. రైతులు, మహిళలు... అమ్మవారికి పొంగళ్లు పెట్టేందుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, రైతుల మధ్య వాగ్వాదం జరిగి తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు లాఠీఛార్జికి దిగారు. ప్రజలు ముందుకు వెళ్లకుండా ఇనుప కంచెలు అడ్డుపెట్టారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మహిళలు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా అమ్మవారికి పొంగళ్లు పెట్టేందుకు తరలివెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నంలో కొందరు మహిళలు కిందపడ్డారు. లాఠీఛార్జిలో మరికొందరికి గాయాలయ్యాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు. ఓటు వేసి గెలిపించినందుకు ఇంత అన్యాయమా అంటూ భావోద్వేగానికి గురయ్యారు. పోలీసలు వాహనాలకు అడ్డంగా రోడ్డుపై బైఠాయించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
.