తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన సాయి... టీఎస్ ఆర్టీసీలో తాత్కాలిక డ్రైవర్గా పనిచేస్తున్నాడు. విధుల్లో ఉన్న అతను తమ వైపు చేయి చూపిస్తూ... అసభ్యకరంగా ప్రవర్తించాడని కొందరు మహిళా కండక్టర్లు ఆరోపించారు. మణుగూరు డిపోలో ఆందోళన చేస్తున్న కార్మికులకు విషయం చెప్పారు. ఆర్టీసీ కార్మికులు.. సాయిని అసభ్య పదజాలంతో దూషిస్తూ... దాడికి దిగారు. సమాచారం తెలుసుకున్న సీఐ సంఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. మహిళా కండక్టర్లు, తాత్కాలిక డ్రైవర్ పోలీస్స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు.
- ఇవీ చదవండి
- ఆపన్న హస్తం కోసం ఆ తల్లిదండ్రుల ఎదురుచూపులు