చరిత్ర నేర్పిన పాఠాలు నేర్చుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయన్నారు. అభివృద్ధి కేంద్రంగా.. ఉద్యోగాలు కేంద్రంగా ఉన్న నగరాలను మనం వదులుకున్నామన్నారు. వెలగపూడి తాత్కలిక అసెంబ్లీ అని.. అది చంద్రబాబు ఇచ్చిన జీవో అని గుర్తు చేశారు. తమది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమని... వారి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకుంటామన్నారు. ఆ నిర్ణయాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని స్పష్టం చేశారు.
మార్షల్స్‌ను పిలిస్తే.. బాగుంటుందేమో !
ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్న సమయంలో తెదేపా శాసనసభ్యులు జై అమరావతి అంటూ పెద్ద ఎత్తున్న నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి...మార్షల్స్‌ను పిలిచి వారిని పంపిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ప్రతిపక్ష పార్టీ సభ్యులు కావాలనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు.
ఇదీచదవండి