జగన్ అక్రమాస్తుల కేసులో పెన్నా ప్రతాప్‌రెడ్డి నేతృత్వంలోని పెన్నా సిమెంట్స్, ఎంబసీ ప్రాపర్టీస్ ఆస్తుల విషయంలో ఈడీ తాత్కాలిక జప్తుపై యథాతథస్థితి కొనసాగించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అప్పిలేట్ ట్రైబ్యునల్ తీర్పుపై ఈడీ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. అక్రమాస్తుల కేసుల విచారణలో భాగంగా అనంతపురం జిల్లా యాడికి మండలంలో పెన్సా సిమెంట్స్‌కు చెందిన 231 ఎకరాలు, హైదరాబాద్‌లోని పయనీర్ హాలిడే రిసార్ట్స్‌కు చెందిన హోటల్‌లో 1697 చదరపు అడుగులను ఈడీ అటాచ్ చేసింది. దీనిపై పెన్నాసిమెంట్స్, పయనీర్ రిసార్ట్స్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించగా ...అప్పిలేట్ ట్రైబ్యునల్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెన్నా భూముల జప్తు కొనసాగినా హోటల్ స్థలాన్ని విడుదల చేయాలని వాటికి బదులుగా 6 కోట్ల 69 లక్షల ఫిక్సిడ్ డిపాజిట్లు తీసుకోవాలని ఈడీని ఆదేశించింది. ఈ విషయంపై ఈడీ హైకోర్టును ఆశ్రయించగా... యథాతథస్థితిని కొనసాగిస్తూ వివరణ ఇవ్వాలని పెన్నాసిమెంట్స్, పయనీర్ రిసార్ట్‌కు నోటీసులు జారీ చేసింది. ఎంబసీ రియాల్టర్స్ ఆస్తుల కేసులోనూ యథాతథస్థితి కొనసాగించాలంటూ నోటీసులిచ్చింది.
ఇదీ చదవండి :