ఇదీ చదవండి :
రైతుల సమస్యలపై తెదేపా నిరసన - tdp agitation on farmers issues
రైతుల సమస్యలపై తెదేపా నిరసన బాటపట్టింది. పంటకు గిట్టుబాటు ధర కల్పించి... సమస్యలు పరిష్కరించాలని సచివాలయం ఫైర్‌స్టేషన్ వద్ద నిరసన ప్రదర్శన చేపట్టింది. తెదేపా అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ర్యాలీ చేశారు. రాష్ట్రంలో రైతులను పట్టించుకునే నాథుడే లేడని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సమస్యలపై తెదేపా నిరసన
''అమ్మబోతే అడవి కొనబోతే కొరవిలా'' రైతుల పరిస్థితి ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సచివాలయం ఫైర్‌స్టేషన్ వద్ద చంద్రబాబు అధ్యక్షతన చేపట్టిన నిరసనలో ఆ పార్టీ ఎమ్మెలేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. పంటకు గిట్టుబాటు ధరతోపాటు... సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వరికంకులు, పత్తి, మొక్కజొన్న పొత్తులతో నిరసన ప్రదర్శన చేశారు. రైతుల నుంచి పంటకొనే నాథుడు లేరని చంద్రబాబు ధ్వజమెత్తారు. దిగుబడి తగ్గినా ఎవ్వరు కొనటంలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేరుశనగ, పామాయిల్, శనగ, పసుపు, పత్తి రైతులు కష్టాల్లో ఉన్నందున... వారికీ గిట్టుబాటు ధర చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. 6 నెలలుగా ప్రభుత్వం రైతులను మోసం చేస్తూనే ఉందని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు ఆక్షేపించారు. రైతులకు గిట్టుబాటు ధర చెల్లించే వరకు పోరాటం కొనసాగుతోందని మరోనేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తేల్చిచెప్పారు.
ఇదీ చదవండి :