నియోజకవర్గ సమస్యలపైనే సీఎం జగన్ను కలిశానని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరి తెలిపారు. మంత్రి వెల్లంపల్లితో కలిసి తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో ఆయన భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమస్యలు పరిష్కరిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం నిర్ణయాన్ని మద్దాలి గిరి స్వాగతించారు.
ఇదీ చదవండి :'సీఎం ఆదేశాల మేరకే అన్నీ జరుగుతున్నాయి'