రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి వెంటిలేటర్‌పై ఉందని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. పాలన చేతకాక ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేస్తున్నారన్నారు. అమరావతిని చంపేసే ప్రయత్నం చేసి డబ్బుల్లేవని గోల చేస్తున్నారని ఆక్షేపించారు. గతంలో తాము సరాసరి 22 వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తే...ఈ ప్రభుత్వం 3 నెలల్లో 18 వేల కోట్ల రూపాయలు అప్పు చేసిందని దుయ్యబట్టారు. పరిశ్రమలు బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌కు పోతున్నాయి తప్ప...రాష్ట్రం వైపు చూడటం లేదని ఆరోపించారు.
ఇవి కూడా చదవండి: