చంద్రబాబు అధికారంలో ఉండగా కుటుంబంతో సహా ఖరీదైన హోటల్లో బస చేశారని... ఇందుకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారన్న జనసేన ట్విట్టర్ విమర్శలపై తెదేపా అభ్యంతరం తెలిపింది. చంద్రబాబు తన విలాసాల కోసం ప్రజా ధనాన్ని ఎప్పుడూ వాడుకోలేదని తెదేపా పేర్కొంది. చంద్రబాబు కుటుంబం హోటల్లో బస చేసిన ఖర్చులకు సంబంధించిన బిల్లులను.. ఆయన సతీమణి భువనేశ్వరి చేసిన చెల్లింపుల వివరాలను పార్టీ అధికారిక ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ సాక్ష్యాలను చూసైనా జనసేన మీడియా అసత్య ప్రచారం మానుకోవాలని తెదేపా నేతలు హితవు పలికారు.
ఇదీ చూడండి: