ETV Bharat / city

'విజయవాడ ప్రాంతంలో రాజధాని వద్దని శివరామకృష్ణ కమిటీ చెప్పలేదు' - చంద్రబాబు తాజా వార్తలు

శివరామకృష్ణ  కమిటీ విజయవాడ ప్రాంతంలో రాజధాని పెట్టొద్దని చెప్పిందంటూ.. ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అబద్దాలు చెబుతోందని ప్రతిపక్షనేత చంద్రబాబు మండిపడ్డారు.

ప్రతిపక్షనేత చంద్రబాబు
ప్రతిపక్షనేత చంద్రబాబు
author img

By

Published : Jan 20, 2020, 8:28 PM IST

ప్రతిపక్షనేత చంద్రబాబు

శివరామకృష్ణ కమిటీ రాజధాని ఎక్కడ పెట్టాలో స్పష్టంగా చెప్పలేదన్నారు తెదేపా అధినేత చంద్రబాబు. అన్ని ప్రాంతాల్లో అనుకూలతలు, ప్రతికూలతలనే చర్చించిందని గుర్తించారు. శివరామకృష్ణ కమిటీ అభిప్రాయ సేకరణలో విజయవాడ ప్రాంతానికే ఎక్కువ మంది ఆమోదం తెలిపారన్నారు. విజయవాడ తర్వాత విశాఖపట్నానికి ఎక్కువ ప్రజామోదం లభించిందన్నారు. శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టును పరిగణనలోకి తీసుకునే విజయవాడ ప్రాంతాన్ని ఎంపిక చేశామని వ్యాఖ్యనించారు.

అమరావతిపై అనేక అసత్యాలు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మునిగిపోతుందని ప్రచారం చేస్తే అలాంటి పరిస్థితి లేదని ఎన్జీటీ తెలిపిందన్నారు. దీనిపై స్పందించిన మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి చంద్రబాబు వాదనను తిప్పికొట్టారు. కృష్ణ, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలు రాష్ట్రంలోనే అత్యంత సారవంతమైన భూములన్న విషయాన్ని శివరామకృష్ణన్ కమిటీ చెప్పిందని.. ఇక్కడ నిర్మాణాలు కూడా సురక్షితం కాదని పేర్కొందన్నారు. బుగ్గన వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానమిస్తూ...మంత్రి.. రిపోర్టులో తనకు అనుకూలంగా ఉన్న భాగాలనే చదివి వినిపిస్తున్నారని తిప్పికొట్టారు. నివేదిక సారాంశాన్ని చెప్పడం లేదన్నారు. విజయవాడ-గుంటూరు ప్రాంతంలోనే రాజధాని ఉండాలని 46శాతం మంది శివరామకృష్ణన్ కమిటీకి చెప్పారన్నారు. రాజధాని ఆమోదసూచికలో ఈ ప్రాంతానికే ఎక్కువ ఆమోదం లభించిందన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.