రాజధానిపై హైకోర్టు వ్యాఖ్యలు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి చెంపదెబ్బ అని మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. హైకోర్టు వద్ద లాయర్లకు కనీసం కప్పు టీ కూడా దొరకటం లేదని చేసిన వ్యాఖ్యలకు ఈ ప్రభుత్వం సిగ్గుపడాలని అన్నారు. వైకాపా ప్రభుత్వ అసమర్థతకు ఈ మాటలు అద్దం పట్టాయని యనమల విమర్శించారు. ఇప్పటికైనా సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించి అభివృద్ది పనులు వేగవంతంగా పూర్తి చేయాలని హితవు పలికారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం జగన్ మధ్య చర్చలు ఏమీ జరగలేదని భాజాపా నేతలే చెప్పడాన్ని యనమల ప్రస్తావించారు. 45 నిమిషాలు చర్చలు జరిగాయని వైకాపా నేతలు అబద్దాలు చెప్పారని ఆరోపించారు. చర్చలు ఏమీ లేకుండానే... జరిగినట్లుగా ఎలా చెబుతారని యనమల ప్రశ్నించారు. రాష్ట్రంలో త్వరలో ఇసుక తుపాన్ రాబోతుందని అన్నారు.
ఇదీ చదవండి