ETV Bharat / city

జనవరి 17న రైతుభరోసా కేంద్రాల ప్రారంభం - rythu bharosa latest news

వచ్చే ఏడాది జనవరి 17 నుంచి గ్రామ సచివాలయాల్లో రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించాలని... ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కేంద్రాల్లో రైతులకు అవసరమయ్యే అన్నిరకాల విత్తనాలు, పురుగు మందులు అందించాలని... సీఎం జగన్‌ ఆదేశించారు. రైతులకు ఏ అవసరం వచ్చినా లభిస్తుందనే భరోసా కల్పించాలని సూచించారు.

rythu bharosa centre to start from january 17th
జనవరి 17న రైతుభరోసా కేంద్రాల ప్రారంభం
author img

By

Published : Dec 19, 2019, 7:47 AM IST

జనవరి 17న రైతుభరోసా కేంద్రాల ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా రైతుభరోసా కేంద్రాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జనవరి 17 నుంచి రైతుభరోసా కేంద్రాలు ప్రారంభించాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. జనవరి నెల చివరికి 3వేల 300, ఫిబ్రవరిలో మరో 5వేల కేంద్రాలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏప్రిల్‌ నాటికి మొత్తం 11వేల 158 కేంద్రాల ఏర్పాటు పూర్తిచేయాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.

ఈ సందర్భంగా రైతుభరోసా కేంద్రంలో అందుబాటులో ఉంచే భూసార పరీక్ష పరికరాలను... అధికారులు ముఖ్యమంత్రికి చూపించారు. మరింత ఆధునిక సాంకేతికను వినియోగించాలని సీఎం సూచించారు. ఈ కేంద్రాల ద్వారానే విత్తనాలు, పురుగు మందులతో పాటు... వ్యవసాయ వినియోగానికి అవసరమైన అన్ని ఉత్పత్తులను అందించాలని నిర్దేశించారు.

పంటలకు బీమా సదుపాయం, కనీస మద్దతు ధరల వివరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పంటల సాగు విధానంపై డిజిటల్‌, వాతావరణ సమాచారాన్ని అందుబాటులో ఉంచాలన్నారు. ఈ-క్రాప్‌ బుకింగ్‌, కౌలు రైతుల సాగు ఒప్పందాల ప్రక్రియ భరోసా కేంద్రాల ద్వారానే జరగాలని సీఎం ఆదేశించారు. ఆక్వా ఫీడ్‌కు సంబంధించి త్వరలో నూతన చట్టాన్ని తీసుకురానున్నట్లు సీఎం జగన్ సూచనప్రాయంగా తెలిపారని... మంత్రి కన్నబాబు వెల్లడించారు.

ఇదీ చదవండీ...

అధైర్యపడొద్దు... అండగా ఉంటాం: చంద్రబాబు

Intro:Body:

bharosa

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.