అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 26 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న పెద్దిరెడ్డి... ఉద్యోగాల నియామకానికి సెప్టెంబరు 1 నుంచి పరీక్షలు ఉంటాయన్నారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు, నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలను సీఎం, డీజీపీ, సీఎస్ నిత్యం పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ...సెప్టెంబరు 5 నుంచి.. కొత్త ఇసుక పాలసీ