అమరావతిపై అసత్య ప్రచారం జరుగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏదో జరిగిందని అపోహలు స్పష్టించి... అమరావతిని చంపేందుకు కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. అమరావతి ప్రజారాజధాని పేరిట విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వైకాపా ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. 'నేను సవాల్ విసురుతున్నా. ఏదైన తప్పులుంటే చర్యలు తీసుకోండి. దానికి నేను అడ్డురాను. కానీ ఆ నెపంతో అమరావతి చంపేందుకు ప్రయత్నిస్తే అది రాష్ట్ర ద్రోహం అవుతుంది" అని చంద్రబాబు అన్నారు.
సంబంధిత కథనం