రాజధాని నిర్మాణ ప్రణాళికను అమలు చేయాలని... అందులో భాగంగా అదనపు వర్షపు నీటి నిర్వహణకు కొండవీటి వాగు, పాల వాగు పనులను చేపట్టేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని హైకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణ ఈ వ్యాజ్యంపై విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది స్పందన కోసం విచారణను గురువారానికి వాయిదా వేశారు. పాలవాగు, కొండవీటి వాగు వరద నివారణ పనుల్ని చేపట్టేలా ఆదేశించాలని కోరుతూ... వెలగపూడికి చెందిన రాంబాబు, మరో ముగ్గురు హైకోర్టును ఆశ్రయించారు.
ఇదీ చదవండి : 'ఏం చేశారని కడప జిల్లాలో పర్యటిస్తున్నారు..?'