మద్యం ధరల పెంపునకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సర్కారు నిర్ణయం వల్ల బార్లు నష్ట పోవాల్సి వస్తోందంటూ...ప్రకాశం జిల్లా ఒంగోలులోని మేఘన, సరిగమ బార్ల యజమానులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ధరల పెంపునకు ఉద్దేశించి రెవెన్యూ, ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ నెల 22న జారీచేసిన జీవో 471ను రద్దు చేయాలని అభ్యర్థించారు. ఎక్సైజ్ శాఖ కమిషనర్, ప్రకాశం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఏపీ బేవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎండీని వ్యాజ్యంలో ప్రతివాదులుగా చేర్చారు.
మద్యం ధరల పెంపుపై హైకోర్టులో వ్యాజ్యం
మద్యం ధరల పెంపుపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ... ఒంగోలులోని రెండు బార్ల యజమానులు హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 22న జారీచేసిన జీవో 471ను రద్దు చేయాలని అభ్యర్థించారు.