ETV Bharat / city

నేడు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటన - అమరావతిలో పవన్ పర్యటన

రాజధాని విషయంలో వైకాపా సర్కార్ తీరును వ్యతిరేకిస్తూ... అమరావతి ప్రాంతంలో కొన్నిరోజులుగా రైతులు ఆందోళనలు చేస్తున్నారు. వారిలో ధైర్యం నింపేందుకు పవన్ కల్యాణ్ మంగళవారం రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు.

pawan kalyan
పవన్ కల్యాణ్
author img

By

Published : Dec 30, 2019, 5:34 PM IST

Updated : Dec 31, 2019, 12:38 AM IST

మీడియాతో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్

రాజధాని ప్రాంత రైతుల ఆందోళనకు మద్దతిచ్చేందుకు... నేడు అమరావతి గ్రామాల్లో పవన్ పర్యటిస్తారని జనసేన గుంటూరు పార్లమెంట్ ఇంఛార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ఎర్రబాలెంలో పర్యటన ప్రారంభమై... మందడం, వెలగపూడి, తుళ్లూరులో సభల అనంతరం ముగుస్తుందని వివరించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన ఆయన... మీడియాతో మాట్లాడారు.

అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను పవన్ తెలుసుకుంటున్నారని వివరించారు. అమరావతిలో అవినీతి ఆరోపణలపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో విశాఖలో ఇన్​సైడర్ ట్రేడింగ్​పైనా విచారణ జరపాలన్నారు. సంక్షేమ పథకాలు అందక వైకాపాను ప్రజలు చీదరించుకుంటున్న సమయంలో... 3 రాజధానుల అంశం తెరపైకి తెచ్చారని ఆయన ఆరోపించారు. రాజధాని అంశంపై నిన్నటి సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.

ఇదీ చదవండి:'సీఎం ఆదేశాల మేరకే అన్నీ జరుగుతున్నాయి'

Reporter : S.P.Chandra Sekhar REPORTER : Ejs trainee sai kumar Camera : ALI Date : 30-12-2019 Centre : Guntur File : AP_GNT_06_30_Janasena_Amaravathi_meeting_byte_3053245_9727010 NOTE : Feed from dsng.... ( ) సంక్షేమ పథకాలు అందక వైసిపి ప్రభుత్వాాన్ని ప్రజలు చీదరించుకుంటున్న సమయంలో.. మూడు రాజధానుల అంశం తెరపైకి తెచ్చారని... జనసేన గుంటూరు పార్లమెంటు ఇంచార్జ్ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. రాజధాని అంశంపై ఇవాళ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు ఆయన తెలిపారు. అన్ని ప్రాంతాల వారి అభిప్రాయాలను పవన్ తెలుసుకుంటున్నారని వివరించారు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం పై ఆరోపణలు చేయటం కాకుండా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. అదే సమయంలో విశాఖపట్నంలో జరుగుతున్న అక్రమాలపై కూడా విచారణ జరపాలన్నారు. రాజధాని రైతుల ఆందోళనకు మద్దతిచ్చేందుకు.. రేపు రాజధాని గ్రామాల్లో పవన్ పర్యటించనున్నట్లు చెప్పారు. ఉదయం 8 గంటలకు ఎర్రబాలెంలో పర్యటన ప్రారంభమై.. మందడం, వెలగపూడి, తుళ్లూరులో సభల అనంతరం ముగుస్తుందని వివరించారు. బైట్.. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన గుంటూరు పార్లమెంటు ఇంచార్జ్
Last Updated : Dec 31, 2019, 12:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.