ETV Bharat / city

'రాజధాని మార్పు అంటే.. ఆఫీసును తరలించడం కాదు' - రాజధానిపై సీఎం వ్యాఖ్యలపై పవన్ ట్వీట్స్ వార్తలు

రాజధాని మార్పంటే ఆఫీసును ఒకచోట నుంచి మరోచోటుకు మార్చడం కాదనీ.. కొన్నివేల జీవితాలను బలవంతంగా తరలించడమేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధాని అంశంపై సీఎం వ్యూహం ప్రకారమే మాట్లాడుతున్నారని ఆరోపించారు.

pawan kalyan tweets on cm jagan comments on capital
పవన్ కల్యాణ్
author img

By

Published : Dec 18, 2019, 9:45 AM IST

రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ వ్యూహం ప్రకారమే అసెంబ్లీలో ప్రకటన చేశారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ విమర్శించారు. విశాఖ ప్రాంతంలో భూములను ముందుగానే హస్తగతం చేసుకుంటూ వచ్చారని.. వివాదాస్పద భూముల విషయంలో పంచాయతీలు మొదలుపెట్టారని విమర్శించారు. భూముల విషయంలో కఠినంగా వ్యవహరించినందునే అక్కడి జాయింట్ కలెక్టర్ శివశంకర్‌ను తప్పించి.. తమకు అనుకూలమైన వేణుగోపాల్‌రెడ్డిని నియమించుకున్నారని ఆరోపించారు. వారం క్రితమే ఈ హడావిడి బదిలీ జరిగినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇక అక్కడ పులివెందుల పంచాయతీలు మొదలవుతాయని విమర్శించారు.

pawan kalyan tweets on cm jagan comments on capital
పవన్ కల్యాణ్

వారి బాధ్యత ఎవరు తీసుకుంటారు

అమరావతిలో పరిపాలన ఇంకా కుదురుకోలేదన్నారు. ఉద్యోగులు, వారి కుటుంబాలు రాజధాని ప్రాంతానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారని.. వారి పిల్లలు ఇక్కడి విద్యాసంస్థల్లో చేరారని వివరించారు. ఇపుడు వారిని మరోచోటుకి వెళ్లిపోమంటే ఎలా అని ప్రశ్నించారు. రాజధాని మార్పు అంటే ఆఫీసును ఒకచోట నుంచి మరో చోటకు మార్చడం కాదనీ.. కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించడమేనని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల వ్యయప్రయాసలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.

pawan kalyan tweets on cm jagan comments on capital
పవన్ కల్యాణ్

ఇవీ చదవండి..

3 రాజధానుల ప్రస్తావనపై... పవన్ ట్వీట్

Intro:Reporter S.P.Chandra Sekhar
Centre guntur
File ap_gnt_05_18_Pawan tweets on capital _AV_3053245
Date 18-12-19
Centre gunturBody:రాజధాని అంశంపై ముఖ్యమంత్రి ఓ వ్యూహం ప్రకారమే అసెంబ్లీలో ప్రటన చేశారని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ట్విట్టర్లో విమర్శించారు.
ప్రస్తుతం ఉత్తరాంధ్ర భూములు చాలావరకు వైకాపా నేతల చేతుల్లోకి వెళ్లాయని స్థానికులు చెప్పినట్లు ఆయన వెల్లడించారు.
విశాఖ ప్రాంతంలో భూములను ముందుగానే హస్తగతం చేసుకుంటూ వచ్చారని పవన్ ఆరోపించారు. విశాఖలో వివాదాస్పద భూముల విషయంలో పంచాయతీలు మొదలుపెట్టారని విమర్శించారు. భూముల విషయంలో కఠినంగా వ్యవహరించినందునే.. అక్కడి జాయింట్ కలెక్టర్ శివశంకర్‌ను ఆగమేఘాలపై తప్పించి... తమకు అనుకూలమైన వేణుగోపాల్‌రెడ్డిని నియమించుకున్నారని ఆరోపించారు. వారం రోజుల క్రితమే
ఈ హడావిడి బదిలీ జరిగినట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇక అక్కడ పులివెందుల పంచాయతీలు మొదలవుతాయని వ్యాఖ్యానించారు. ప్రస్తుత రాజధాని
అమరావతిలో పరిపాలన ఇంకా పూర్తిగా కుదురుకోలేదన్నారు పవన్. ఉద్యోగులు, వారి కుటుంబాలు రాజధాని ప్రాంతానికి ఇపుడిపుడే అలవాటు పడుతున్నారని..
వారి పిల్లలు కూడా రాజధాని ప్రాంతంలో విద్యాసంస్థల్లో చేరారని వివరించారు. ఇపుడు
వాళ్లని మళ్లీ ఎగ్జిక్యూటివ్ రాజధాని అని మరోచోటికి వెళ్లిపోమంటే ఎలాగని ప్రశ్నించారు. రాజధాని మార్పు అంటే ఆఫీసు ఒకచోట నుంచి మరో చోటకు మార్చడం కాదని అభిప్రాయపడ్డారు. ఇది
కొన్ని వేల జీవితాలను బలవంతంగా తరలించడమేనని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల వ్యయప్రయాసలకు బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు..

విజివల్స్.... Conclusion:8008020895
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.