ETV Bharat / city

''నేను చేసుకున్న పెళ్లిళ్లతోనే జగన్ రెండేళ్లు జైలుకెళ్లారా..?'' - జగన్ పై పవన్ సంచలన వ్యాఖ్యల వార్తలు

ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ నిర్ణయంపై మాట్లాడితే వ్యక్తిగత విమర్శలతో సమస్యలను పక్కదారి పట్టేంచాలా చూస్తున్నారని అన్నారు. తన పెళ్లిళ్ల వల్లే జగన్ రెండేళ్లు జైలుకు వెళ్లారా అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలపై జనసేన నిరంతరం పోరాడతుందని, వైకాపా నాయకుల బెదిరింపులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.

pawan-kalyan-comments-on-cm-jagan-over-personal-comments-on-janasena-chief
author img

By

Published : Nov 12, 2019, 5:57 PM IST

Updated : Nov 12, 2019, 7:13 PM IST

తనపై ముఖ్యమంత్రి జగన్ చేసిన విమర్శలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిప్పికొట్టారు. ''సినిమా స్టార్.. 3 పెళ్లిళ్లు చేసుకున్న పవన్ కల్యాణ్.. తన పిల్లలను ఏ మాధ్యమంలో చదివిస్తున్నారు?'' అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ తీవ్రంగా స్పందించారు.

' పెళ్లిళ్లతోనే రెండేళ్లు జైలుకెళ్లారా జగన్..?'

"నేను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాని ప్రతి సారీ అంటున్నారు. నేను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకు వచ్చిన ఇబ్బందేంటి..? మీరు కూడా చేసుకోవచ్చు. నేను చేసుకున్న పెళ్లిళ్ల వల్లే మీరు రెండేళ్లు జైలుకు వెళ్లారా జగన్? "- పవన్ కల్యాణ్, జనసేన అధినేత

అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రాష్ట్రంలో ఇసుక దొరకుండా చేశారని పవన్ విమర్శించారు. ఇసుక కొరత వల్ల పని దొరక్క కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్ల పాటు ప్రభుత్వాన్ని విమర్శించాల్సిన అవసరం రాదనుకున్నామని కానీ... ప్రభుత్వ వైఖరి వల్ల నాలుగు నెలలకే రోడ్డెక్కాల్సి వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వంపై పవన్ ఎందుకు పోరాడలేదని విమర్శిస్తున్న వైకాపాకు నాయకులకు పవన్ సమాధానమిచ్చారు. ఇసుక విషయంలో గత ప్రభుత్వంపైనా పోరాడామని స్పష్టం చేశారు.

''జనసేన అంటే మీకు భయం''

జనసేన అంటే మీకు భయం

తాము లేవనెత్తిన సమస్యలపై ముఖ్యమంత్రి ఇంత ఘాటుగా స్పందించారంటే.. కారణం జనసేన అంటే భయమనేనని పవన్ అన్నారు. కేవలం ఒక్క ఎమ్మెల్యే ఉన్న జనసేనను చూసి 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైకాపా ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. ఇందుకు కారణం వారి పాలనలో ఎన్నో తప్పులున్నాయని అన్నారు.

శిక్షణ ఇవ్వకుండా ఆంగ్లమాధ్యమమా..?

శిక్షణ ఇవ్వకుండా ఆంగ్లమాధ్యమమా..?

పాఠశాలాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా పవన్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ చరిత్ర గురించి సీఎం జగన్‌కు అవగాహన ఉందా? అని నిలదీశారు. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిందే భాషాప్రయుక్త రాష్ట్రం ప్రాతిపదికన అని గుర్తు చేశారు. ఉపాధ్యాయులకు ఇంగ్లిష్‌లో శిక్షణ ఇవ్వకుండా ఆంగ్లమాధ్యమం ప్రవేశపెడితే లాభమేంటని నిలదీశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల విద్యార్థుల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారుతుందని అన్నారు. ఉపాధ్యాయులను సిద్ధం చేసిన తర్వాతే ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.

''వైకాపా నాయకుడిగా మాట్లాడకండి''

ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే వైకాపా నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పవన్ దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్మోహన్ రెడ్డి వైకాపా నాయకుడిగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాట్లాడితే బాగుంటుందని సూచించారు. ''ఇష్టారాజ్యంగా మాట్లాడితే తెదేపా నాయకుల్లా సహించేది లేదు.. మాది జనసేన పార్టీ అని గుర్తుంచుకోండి'' అంటూ వైకాపా నాయకులను పవన్ హెచ్చరించారు.

ఇదీ చూడండి:

మీ పిల్లలు ఏ మాధ్యమంలో చదువుతున్నారు:సీఎం జగన్

Last Updated : Nov 12, 2019, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.