ETV Bharat / city

భాగ్యనగరంలో 'ఉల్లి' చోరీ... దొంగను పట్టించిన సీసీటీవీ - హైదరాబాద్​లో 20 కిలోల ఉల్లిగడ్డల చోరీ

ఇప్పటి వరకు బంగారం, వెండి ఆభరణాలు దొంగతనం చేయడం చూశాం. మద్యం దొంగిలించడం గురించి విన్నాం.. అయితే ఉల్లిపాయలు చోరీకి గురవ్వడం విచిత్రంగా ఉంది కదూ..! ఈ సంఘటన హైదరాబాద్​లో జరిగింది.

onions-got-theft-at-domalaguda-in-hyderabad
భాగ్యనగరంలో 'ఉల్లి' దొంగ
author img

By

Published : Dec 14, 2019, 12:55 PM IST

హైదరాబాద్​ దోమలగూడలోని జ్యోతినగర్​లో తోపుడు బండి మీద ఓ మహిళ ఉల్లిపాయలు విక్రయిస్తుంటుంది. రోజూలానే రాత్రి కాగానే బండి మూసేసి.. ఫుట్​పాత్​ పక్కన పెట్టి ఇంటికి వెళ్లిపోయింది. ఇదంతా గమనించిన ఓ వ్యక్తి.. అర్ధరాత్రి సమయంలో అక్కడికి వచ్చి 20 కిలోలకు పైగా ఉల్లిపాయలను సంచిలో వేసుకొని వెళ్లాడు.

తెల్లవారుజామున ఉల్లి విక్రయించే మహిళ వచ్చి చూసేసరికి తన బండిలో ఉల్లి తక్కువగా ఉండటం గమనించింది. ఎవరో దొంగతనం చేశారని నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఆ వ్యక్తిని గుర్తించారు.

భాగ్యనగరంలో ఉల్లికీ భద్రత లేకుండా పోయిందనీ.. ఇకపై ఉల్లిపాయలకూ భద్రత కల్పించాల్సిన అవసరముందని బండి యజమాని ఈశ్వరీబాయి అభిప్రాయపడ్డారు.

Intro:సమాజంలో బంగారము వెండి నగలు దొంగతనం చేయడం చూశాను కానీ ఉల్లిగడ్డ దొంగతనం చేయడం విచిత్రంగా ఉంది

Body:ప్రస్తుతం ఉల్లిగడ్డల ధరలు విపరీతంగా పెరగడంతో బిడ్డలకు రక్షణ కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇది విచిత్రంగా ఉంది కదూ ఉల్లిగడ్డల ధరలు ఉండడంతో దోమలగూడ లోని జ్యోతి నగర్ లో ఓ వ్యక్తి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఈ ఘటన దొంగతనానికి పాల్పడ్డారు దాదాపు 20 కిలోల ఉల్లిగడ్డలను పథకం ప్రకారం రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై పెట్టుకొని వ్యాపారం చేసుకునే ఓ మహిళ ఉల్లిగడ్డ దుకాణంపై కన్ను వేశాడు ఉల్లిగడ్డలు దొంగతనం చేయడానికి దాదాపు అరగంట సేపు పచార్లు కొట్టి చివరకు 20 కిలోల పైగా ఉల్లిగడ్డలను అర్థం చేసుకొని పారిపోవడం సీసీ కెమెరాల్లో చిక్కింది...... తాను 40 ఏళ్లుగా ఈ రోడ్డుపై వ్యాపారం చేసుకుంటున్న ఏనాడు ఇలా దొంగతనం జరగలేదని సీసీ కెమెరాలు ఉన్నా కానీ దొంగతనం జరగడం విచిత్రంగా ఉందని ఆ షాపు యజమాని ఈశ్వరి బాయి ఆవేదన వ్యక్తం చేశారు.....

బైట్..... ఈశ్వరి బాయి షాపు యజమాని

Conclusion:ప్రస్తుతం హైదరాబాద్లో ఉల్లిగడ్డల కూడా భద్రత కల్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది.......
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.