ETV Bharat / city

మనసు 'దో(శ)చే' సావిత్రమ్మ టిఫిన్​ సెంటర్​

ఒక్క రూపాయికే దోశ... ఇదేదో పండగ ఆఫర్ అనుకుంటే పొరపడినట్లే. గత 40 ఏళ్లుగా ఓ అవ్వ కేవలం ఒక్క రూపాయికే దోశ విక్రయిస్తూ ఎందరో ఆకలి తీరుస్తోంది. మరి ఆ దోశ రుచేంటో.. ఆ అవ్వ అంతరంగమేంటో తెలుసుకోవాలంటే... అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఏటిగడ్డ పాళ్యం చేరాల్సిందే..!

one-rupee-dosha-in-anantapur-district
one-rupee-dosha-in-anantapur-district
author img

By

Published : Jan 1, 2020, 5:07 PM IST

Updated : Jan 1, 2020, 5:26 PM IST

దోశ... తినాలంటే జేబులో రూ. 20 ఉండాల్సిందే. ఇంకాస్తా పేరున్న సెంటర్​కు వెళ్తే ఇంకో 20 రూపాయలు అదనంగా చెల్లించాల్సిందే. కానీ అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం ఏటిగడ్డ పాళ్యంలోని సావిత్రమ్మ దోశల కేంద్రంలో కేవలం ఒక్క రూపాయికే దోశ దొరుకుతుంది. ఏదో సాదాసీదాగా కాదండోయ్​.. రుచి చూస్తే మళ్లీ మళ్లీ తినాలనిపించేంతగా ఉంటుంది ఆ దోశ.

సావిత్రమ్మ టిఫిన్​ సెంటర్​లో ఒక రూపాయికే దోశ

40 ఏళ్లుగా ఒక్క రూపాయికే..

ఏటిగడ్డ పాళ్యం కాలనీకి చెందిన సావిత్రమ్మ 40 ఏళ్లుగా దోశల వ్యాపారం చేస్తోంది.1980 సంవత్సరంలో టిఫిన్​ సెంటర్​ ప్రారంభించిన ఆమె... అప్పట్లో ఒక దోశ 25 పైసలకు అమ్మేది. కొన్నేళ్లకు ధరను 50 పైసలకు పెంచింది. కాలక్రమేణా 50 పైసలు రద్దు కావడం వల్ల రూ.2 రూపాయలకు మూడు దోశలు విక్రయిస్తూ వచ్చింది. గత నాలుగేళ్ళ నుంచి పెరిగిన ధరల దృష్ట్యా.. ఒక రూపాయికి ఒక దోశ ఇవ్వడం మొదలుపెట్టింది. రూపాయికే దోసెతో పాటు రెండు రకాల చెట్నీలు కూడా ఇస్తుంది. దాదాపు రోజుకు 500 దోసెలకు పైగా విక్రయిస్తోంది. అయినా ఆ అవ్వకు రోజుకు మిగిలేది వంద రూపాయిలు మాత్రమే.

ఎదుటివారి ఆకలి తీర్చడమే ఆనందం

ఇంత తక్కువకు దోశలు అమ్మడంపై ఆ అవ్వను కదిలిస్తే.... తన ఖర్చుకు సరిపడా మాత్రమే సంపాదిస్తూ తోటి వారి ఆకలి తీర్చడంలోనే ఎంతో ఆనందం ఉంటుందని చెబుతోంది. స్వలాభం మానుకుని ఎంతో మంది పేద, మధ్య తరగతి వాళ్ల ఆకలి తీరుస్తోన్న సావిత్రమ్మ... స్థానికుల నుంచి మన్ననలు పొందుతోంది.

ఇదీ చదవండి:

రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న.. డిప్యూటీ సీఎం టిక్​ టాక్​

Intro:*ఒక్కరూపాయికే దోస
*నలభై ఏళ్లుగా పేదల ఆకలి తీరుస్తున్న అవ్వ

ఒక్క రూపాయికే దోస.. ఇదేదో పండుగ ఆఫర్ అనుకుంటే పొరపడినట్లే...గత నలభై ఏళ్లుగా ఓ అవ్వ రూ.1 దోస విక్రయిస్తూ ఎందరో ఆకలిని టీరుస్తోంది. ఈ అవ్వది అనంతపురం జిల్లా, తాడిపత్రి పట్టణంలోని ఏటిగడ్డ పాళ్యం.

అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం ఏటిగడ్డ పాల్యం కాలనీకి చెందిన సావిత్రమ్మ 40 ఏళ్లుగా దోసెల వ్యాపారం చేస్తోంది.. సాధారణంగా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల దోశలు ఉంటాయి. అయితే సావిత్రమ్మ వద్ద అతి తక్కువ ధరకే రుచికరమైన దోస లభిస్తుంది.. 1980 సంవత్సరంలో సావిత్రమ్మ దోసెల కేంద్రాన్ని ప్రారంభించింది. అప్పట్లో ఒక దోస ధర 25 పైసలు మాత్రమే.. కొన్నేళ్లకు 25 పైసలు రద్దు అవడంతో దోస ధర 50 పైసలు చేసింది. రానురాను 50 పైసలు కూడా రద్దు అవడంతో రూ.2 మూడు దోసెలు విక్రయించేది. గత నాలుగేళ్ళ క్రితం నుంచి పెరిగిన ధరల దృష్ట్యా ఒక దోస రూ.1 కి పెంచింది... రూపాయికే దోసతో పాటు రెండు రకాల చెట్నీలను కూడా ఇస్తుంది. సావిత్రమ్మ ఒక రోజుకు దాదాపు 500 దోసెలను విక్రయిస్తుంది.. ఐనా తనకు మిగిలేది మాత్రం రూ.100 మాత్రమే.. ఈ అవ్వ(సావిత్రమ్మ) వద్ద పనులకు వెళ్లే కూలీలు, పాఠశాలకు వెళ్లే చిన్నారులే ఎక్కువగా దోసెలు కొనుకోలు చేస్తారు.. తన ఖర్చుకు సరిపడా మాత్రమే సంపాదిస్తూ తోటి వారి ఆకలి తీర్చడంలో ఎంతో ఆనందం ఉంటుందని సావిత్రమ్మ చెబుతుంది.. స్వలాభం మానుకుని తోటి వారి ఆకలి తీరుస్తూ సావిత్రమ్మ అందరి మన్ననలు పొందుతోంది..

Body:బైట్1: సావిత్రమ్మ(దోస కేంద్రం నిర్వహకురాలు)
బైట్2: గౌసియా (స్థానిక మహిళ)

Conclusion:రిపోర్టర్: లక్ష్మీపతి నాయుడు
ప్లేస్: తాడిపత్రి, అనంతపురం జిల్లా
కిట్: 759
ఫోన్: 7799077211
7093981598
Last Updated : Jan 1, 2020, 5:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.