పాఠశాలల్లో నాడు- నేడు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. మూడేళ్లలో 3 దశల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తామని సీఎం తెలిపారు. వైద్య, విద్యాశాఖ అధికారులతో జగన్ సమావేశం నిర్వహించారు. నవంబర్ 14 న ''నాడు -నేడు" కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభిస్తామన్నారు.
ఆసుపత్రుల్లోనూ..
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ నాడు -నేడు కార్యక్రమం అమలు చేస్తామన్నారు సీఎం. మూడు దశల్లో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితి పూర్తిగా మార్చాలని అధికారులకు సూచించారు. వచ్చే జనవరిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ప్రకటన ఇవ్వాలన్నారు. మే నాటికి ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సుల పోస్టుల భర్తీ చేయాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: