ఏదైనా అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాక... దాన్ని ఉల్లంఘించే హక్కు ఎవరికీ లేదంటూ తెదేపా ఎంపీ కేశినేని నాని అన్నారు. అమరావతి రాజధానిగా ఉండాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప... ఓ వ్యక్తిది కాదంటూ స్పష్టం చేశారు. 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే అమరావతిలో రాజధాని పనులు పూర్తవుతాయని వెల్లడించారు. రాజధాని తరలిస్తే న్యాయపరంగా అమరావతి రైతులకు లక్షా 60 వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి ఇవ్వవలసి వస్తుందని తెలిపారు.
ఇదీ చదవండి: