ETV Bharat / city

"రాజధానిగా అమరావతిని కొనసాగించే పరిస్థితుల్లో వైకాపా లేదు"

రాజధాని అమరావతిపై మంత్రుల వ్యాఖ్యలు  గందరగోళం సృష్టించేలా ఉన్నాయని ఎంపీ జీవీఎల్ అన్నారు. దిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన...రాజధానిగా అమరావతిని కొనసాగించే ఆలోచనలో వైకాపా ప్రభుత్వం లేదనిపిస్తోందని వ్యాఖ్యానించారు. రాజధానిలో అక్రమాలు జరిగాయంటున్న మంత్రులు..తగిన ఆధారాలను ప్రజల ముందు ఉంచాలన్నారు.

"రాజధానిని కొనసాగించే పరిస్థితుల్లో వైకాపా లేదనిపిస్తోంది"
author img

By

Published : Aug 28, 2019, 2:19 PM IST

అమరావతిలో రాజధానిని కొనసాగించే యోచనలో వైకాపా ప్రభుత్వం లేదనిపిస్తోందని భాజపా ఎంపీ జీవీఎల్ అన్నారు. రాజధానిని కొనసాగించకుంటే భూములిచ్చిన రైతుల పరిస్థితేంటని ప్రశ్నించారు. రాజధానిపై మంత్రుల వ్యాఖ్యలు గందరగోళాన్ని సృష్టిస్తున్నాయని అన్నారు. రైతులకు నష్టం వాటిల్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలన్న ఆయన... రాజధానిని మారిస్తే భూములిచ్చిన రైతులు నష్టపోతారని వ్యాఖ్యానించారు.

"రాజధానిని కొనసాగించే పరిస్థితుల్లో వైకాపా లేదనిపిస్తోంది"
కక్ష సాధింపు చర్యలు ఉండరాదు..
రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజా ప్రయోజనాల కోసమే ఉండాలని అన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా ఉండరాదని హితవు పలికారు. ఇన్​సైడ్ ట్రేడింగ్ పై స్పష్టమైన ఆధారాలు ప్రజల ముందు ఉంచాలని పేర్కొన్నారు.
అనుకున్న రీతిలో అభివృద్ధి లేదు..
రాజధాని అమరావతిలో ఉండాలనేది అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని జీవీఎల్ అన్నారు. భవనాల నిర్మాణం కోసం రూ.2,500 కోట్లిస్తామని కేంద్రం ఒప్పకుందని గుర్తు చేశారు. రూ.1500కోట్లు తాత్కాలిక భవనాల కోసమే ఉపయోగించుకున్నారని తెలిపారు. రాజధాని అంశం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని వ్యాఖ్యానించారు. అనుకున్న రీతిలో తెదేపా ప్రభుత్వం అభివృద్ధి చేయలేదని అభిప్రాయపడ్డారు.
బాధ్యులు ఎవరు..?
గత ప్రభుత్వంపై వస్తున్న ఫిర్యాదులపై ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్న జీవీఎల్...అనవసర ఖర్చులు చేసిన దానికి ఎవరిని బాధ్యులుగా నిర్ధరిస్తారని ప్రశ్నించారు. తనకున్న సమాచారం ప్రకారం వైకాపా రాజధాని కొనసాగించే ఆలోచనలో లేనట్లు తెలిసిందని వ్యాఖ్యానించారు.

Intro:కె.శ్రీనివాసు,
కంట్రిబ్యూటర్,
నరసాపురం,
పశ్చిమ గోదావరి జిల్లా.

note ఈనాడు ఈ టీవీ సినర్జీ గా పరిశీలించగలరు

ap_tpg_32_27_avhaghansadasu_avb_ap10090.

యాంకర్.. వినాయక మట్టి ప్రతిమ లపై అవగాహన సదస్సు

Body:వాయిస్ ఓవర్..... పర్యావరణాన్ని కాపాడుకునేందు కు ప్రతి ఒక్కరూ మట్టి ఇ వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే విధంగా గా చైతన్యం తీసుకురావాలని కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ పేర్కొన్నారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం శ్రీ సూర్య కళాశాలలో ఈనాడు ఈ టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి వినాయకుల ప్రతిమలు వినియోగంపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ ప్రాచీన కాలంలో వినాయక చవితి పండగ వస్తే చెరువులలో బంకమట్టితో విగ్రహాలు తయారు చేసే వారిని తెలిపారు ప్రస్తుతం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలతో జల కాలుష్యం ఏర్పడుతుందన్నారు వాతావరణ సమతుల్యం దెబ్బతినకుండా ప్రతి ఒక్కరూ రూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించే విధంగా కృషి చేద్దామన్నారు అనంతరం పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులు మాట్లాడారు మట్టి వినాయక ప్రతిమ వినియోగిస్తామని ప్రతిజ్ఞ చేశారు

Conclusion:బైట్.... ఘంటసాల బ్రహ్మాజీ కరస్పాండెంట్ శ్రీ సూర్య కళాశాల.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.