ధాన్యం చెల్లింపుల్లో ఎక్కడా జాప్యం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు స్పష్టం చేశారు. ప్రతి రైతు ఖాతాలో 5 రోజుల్లో ధాన్యం డబ్బులు జమ చేస్తున్నామని వెల్లడించారు. ముతక రకం ధాన్యం రూ.1810, ఏ గ్రేడ్‌కు రూ.1830 ధర ఉందని వివరించారు. సచివాలయంలో మాట్లాడిన ఆయన అన్ని చోట్ల కనీస ధర కంటే తక్కువగా అమ్మడం లేదని అన్నారు. కర్నూలు, తూర్పుగోదావరి జిల్లాల్లో ధర కొంచెం ఎక్కువగానే వస్తోందని పేర్కొన్నారు. నేటికి 25 వేల మంది రైతులకు ధాన్యం చెల్లింపులు జరిగాయన్న మంత్రి.. రాష్ట్రంలో రైతులు నష్టపోకుండా చూస్తున్నామని స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ధాన్యం కొనుగోళ్లపై పవన్ కల్యాణ్ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మంత్రి విమర్శించారు. రసీదులు ఇవ్వకుండా ధాన్యం తీసుకుంటున్నారని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు ఖరారు అయిన వెంటనే రైతుల ఫోన్లకు సందేశం వెళ్తందని వెల్లడించారు. రైతు సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవగాహన పెంచుకోవాలని మంత్రి కన్నబాబు సూచించారు.
ఇదీ చదవండి: