ETV Bharat / city

'అమరావతిని అలా నిర్మించే స్తోమత మాకు లేదు'

సింగపూర్ ప్రభుత్వానికి, ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని... మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి స్పష్టం చేశారు. పెట్టుబడులపై సింగపూర్‌ ప్రభుత్వం వెనక్కి తగ్గిందనడంలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఊహించినట్టు అమరావతిని నిర్మించే స్తోమత తమకు లేదని బుగ్గన వ్యాఖ్యానించారు.

'హైదరాబాద్ మీరు కడితే.. కులీ కుతుబ్ షా ఏం చేశారు'
author img

By

Published : Nov 21, 2019, 8:56 PM IST

రాజధాని అమరావతి నిర్మాణంపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొందరు నేతలు అనుకున్నట్టు అమరావతి నగరాన్ని నిర్మించే స్తోమత ప్రభుత్వానికి లేదన్నారు.

మాట్లాడుతున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్​రెడ్డి

'మద్యం దుకాణాలు 20 శాతం తగ్గించాం, పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేశాం. మద్యం దుకాణాలు తగ్గినా, ఆదాయం తగ్గలేదు. గతేడాది అక్టోబర్‌ నాటికి మద్యం మీద రూ.13,088 కోట్లు వచ్చింది. ఈ ఏడాది అక్టోబర్‌ వరకు రూ.13 వేల 97 కోట్ల ఆదాయం వచ్చింది. నీరు- చెట్టు పథకంపై విచారణ జరుపుతున్నాం. ప్రత్యేకహోదా ఉద్యమకారులపై మా ప్రభుత్వమే కేసులు ఎత్తివేసింది. ప్రభుత్వ సొమ్ము ఎక్కడా దుబారా చేయడం లేదు. మా సంక్షేమ పథకాలు దీర్ఘకాలంలో ఫలితాన్నిస్తాయి. విద్యుత్తు పీపీఏల్లో భారీగా వ్యత్యాసం ఉంది. 41 రోజుల్లో 40 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. రూ.2.50కే యూనిట్‌ విద్యుత్తు లభ్యమైతే రూ.4.80కు ఒప్పందం చేసుకున్నారు. పిల్లల చదువు, వైద్యం, పరిశ్రమల ఏర్పాటే మా ప్రాధాన్యాలు.'

-బుగ్గన రాజేంద్రనాథ్​ రెడ్డి.

ఇదీ చదవండి: తెలుగు నేర్చుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది: లోకేశ్

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.