రాజధాని మార్చాలన్నది తమ అభిమతం కాదని... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈ ఆలోచన చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. విజయనగరంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం రాజధాని అంశంపై ఆయన మాట్లాడారు. ఏ ప్రాంతం, ఏ ఒక్కరిపై తమకు ద్వేషం లేదని స్పష్టం చేశారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధే తమ ప్రభుత్వ లక్ష్యమని బొత్స ఉద్ఘాటించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధిపై ప్రతిపక్షాల విధానమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : 'సీఎం ఆదేశాల మేరకే అన్నీ జరుగుతున్నాయి'