రాజధానిపై ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. ప్రభుత్వంపై అసూయతో చంద్రబాబు బురదజల్లే యత్నం చేస్తున్నారన్నారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఆధారలతో సహా బయటపెట్టామన్న అవంతి ...విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని పెట్టాలనుకొవడం మంచి నిర్ణయమన్నారు. జగన్ ఏ సామాజిక వర్గానికీ వ్యతిరేకం, అనుకూలం కాదని పేర్కొన్నారు. రాజధాని రాకముందే విశాఖలో తమకు భూములున్నాయని స్పష్టం చేశారు. గంటా శ్రీనివాసరావులాంటి వారు తమ పార్టీలో చేరాలనుకుంటున్నారన్నారు. గంటా శ్రీనివాసరావు అధికారం లేకపోతే బతకలేరని ఎద్దేవా చేశారు.
రాజధాని విషయాన్ని రాజకీయం చేయొద్దు
రాజధాని విషయాన్ని రాజకీయం చేయొద్దని చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు మంత్రి అవంతి శ్రీనివాసరావు సూచించారు. ప్రస్తుతం అమరావతి ప్రాంతవాసులకు ఎలాంటి నష్టం కలిగించకుండానే మిగిలిన రెండు చోట్లా రాజధానులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని సీఎం అసెంబ్లీలో చెప్పారన్నారు. 3 చోట్ల రాజధానులు ఉండటం వల్ల అన్ని ప్రాంతాల వారికి తమ దగ్గర కూడా ఓ రాజధాని ఉందనే భావన కలుగుతుందని స్పష్టం చేశారు. సామాజికవర్గాలు, ప్రాంతాల ప్రాతిపదికన రాజకీయాలు చేసే ఆలోచనను చంద్రబాబు మానుకోవాలని హితవు పలికారు.
ఇవీ చదవండి: