ETV Bharat / state

"ప్రశాంత్ ప్రేమ విఫలమై.. డిప్రెషన్​లోకి వెళ్లి" - PRASHANTH FATHER BABURAO

ప్రశాంత్‌ రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మా అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమించాడు. ప్రేమ విఫలం కావడంతో డిప్రెషన్​లోకి వెళ్లాడు. ఆ క్రమంలోనే రాజస్థాన్ వెళ్లి.. పాకిస్థాన్ బోర్డర్​లోకి వెళ్లి ఉంటాడు. మా కొడుకుని క్షేమంగా అప్పగించాలి.  - బాబూరావు, ప్రశాంత్ తండ్రి

prashanth father baburao
ప్రశాంత్ తండ్రి
author img

By

Published : Nov 19, 2019, 11:43 AM IST

Updated : Jan 18, 2023, 1:39 PM IST

ప్రశాంత్ ప్రేమ విఫలమై.. డిప్రెషన్​లోకి వెళ్లి

అక్రమంగా దేశంలోకి ప్రవేశించారని ఆరోపిస్తూ ఇద్దరు భారత జాతీయులను పాకిస్థాన్‌ అధికారులు అరెస్టు చేశారు. అందులో తెలుగు వాడైన ప్రశాంత్​ది హైదరాబాద్. ప్రశాంత్​కు సంబంధించిన వివరాలను ఆయన తండ్రి బాబూరావు మీడియాకు వివరించారు. ప్రశాంత్‌ రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు. తమ కుమారుడు సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తి కాదన్నారు.

మా కొడుకుని క్షేమంగా అప్పగించండి...

దిల్లీ వెళ్లి రాయబార కార్యాలయాన్ని సంప్రదిస్తామని బాబూరావు తెలిపారు. మా కొడుకుని క్షేమంగా అప్పగించాలని కోరతామని చెప్పారు. విశాఖకు చెందిన తాము ఆరేళ్ల నుంచి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నామని పేర్కొన్నారు. కూకట్‌పల్లిలోని భరత్‌నగర్‌లో ఆరేళ్లుగా ఉంటున్నామని తెలిపారు.

ప్రేమ విఫమైనప్పటి నుంచే...

ప్రశాంత్ మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేశాడని తండ్రి చెప్పారు. రెండేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడని తెలిపారు. బెంగళూర్‌లోని సాఫ్ట్‌వేర్‌ సంస్థలో సహోద్యోగిని స్వప్నిక పాండేతో ప్రేమలో ఉన్నాడని వివరించారు. ప్రేమ విఫలమైన కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ డిప్రెషన్​లోనే రాజస్థాన్ వెళ్లి ఉంటాడని, పొరపాటున పాక్‌లోకి అడుగుపెట్టి ఉంటాడని సందేహం వ్యక్తం చేశారు. తమ కుమారుడు చాలా మంచోడని, క్షేమంగా తమకు అప్పగించాలని కోరుతున్నాడు.

Last Updated : Jan 18, 2023, 1:39 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.