రాజధాని విభజన నిర్ణయం గొప్పదైతే ముఖ్యమంత్రి జగన్ ఎందుకు భయపడుతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రశ్నించారు. అమరావతి విభజన నిర్ణయం అద్భుతమంటూ వైకాపా నాయకులు డప్పు కొడుతున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన తప్పేంటని.. ఎందుకు గృహనిర్బంధం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కాలరాసే అధికారం వైకాపా ప్రభుత్వానికి ఎవరిచ్చారన్నారు. రాజధాని రైతుల ఉద్యమాన్ని పోలీసు లాఠీలు, ముళ్ల కంచెలతో అణిచి వేయడం సాధ్యంకాదన్నారు. ఎంత తొక్కాలి అనుకుంటే అంతకు పదింతలు ఉద్యమం ఉద్ధృతమవుతుందన్నారు.
ఇవీ చదవండి..