ఇళ్ల పట్టాల పంపిణీ కోసం పెద్ద ఎత్తున స్థలాలను కొనుగోలు చేయాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇందుకోసం రుణం తీసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వానికి రుణమిచ్చేందుకు ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రాథమికంగా అంగీకారాన్ని తెలియజేసింది. ఉచిత ఇళ్ల పట్టాలను ఇచ్చేందుకు 20 లక్షల మంది లబ్ధిదారులను గుర్తించిన రాష్ట్రప్రభుత్వం.. 40 వేల ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తోంది. ఇప్పటికే రెవెన్యూ శాఖ 22 వేల ఎకరాలను రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పంపిణీ కోసం భూమిని గుర్తించింది. అటు పట్టణ ప్రాంతాల్లో భూమి లభ్యత తక్కువగా ఉన్న చోట్ల 18 వేల ఎకరాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఈ భూమి కొనుగోలు చేసేందుకు 8 నుంచి 10 వేల కోట్ల రూపాయల మేర నిధులు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ మొత్తాన్ని రుణంగా ఇచ్చేందుకు ప్రభుత్వం... ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ సంప్రదించింది. ఈ సంస్థ రుణం ఇచ్చేందుకు ప్రాథమికంగా అంగీకారాన్ని తెలియచేసింది.
ఇదీ చదవండి: