ETV Bharat / city

రాజధాని తరలింపు పిచ్చి ఆలోచన: కన్నా

author img

By

Published : Dec 25, 2019, 12:52 PM IST

Updated : Dec 25, 2019, 1:54 PM IST

తుళ్లూరులో రైతులు చేస్తున్న దీక్షకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మద్దతు తెలిపారు. అన్నదాతల సమస్యలతో పాటు రాజధాని కోసం భాజపా పోరాడుతుందని స్పష్టం చేశారు.

kanna laxminaryana supoort formers
kanna laxminaryana supoort formers
రాజధాని తరలింఫు పిచ్చి ఆలోచన: కన్నా

గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతులు, మహిళలు 'మహాధర్నా' చేపట్టారు. అనంతవరం, బోరుపాలెం, దొండపాడు గ్రామాల ప్రజలు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరికి వైద్యులు, అధ్యాపకులు సంఘీభావం తెలిపారు. రైతుల దీక్షకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, రావెల కిషోర్​బాబు మద్దతు ప్రకటించారు.

తరలింఫు ఆలోచన మంచిదికాదు...
రాజధాని తరలించాలనే ఆలోచన మంచిది కాదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవాళ్లు ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించాలని అభిప్రాయపడ్డారు. రైతుల సమస్యలతో పాటు రాజధాని కోసం కూడా భాజపా పోరాడుతుందని స్పష్టం చేశారు. ఎన్నికలకు ముందు అమరావతిని అంగీకరించిన జగన్... ఇప్పుడేందుకు మాట మార్చారని ప్రశ్నించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలనేది భాజపా డిమాండ్ అని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి : సమరావతి: రాజధాని రైతుల జలదిగ్బంధం

Last Updated : Dec 25, 2019, 1:54 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.