జగన్ సీఎం కాగానే విశాఖ రాజధాని అనుకున్నారని జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. ఒక వ్యక్తి, కులంపై ద్వేషంతో రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెట్టకూడదన్నారు. మందడంలో రైతులు చేస్తున్న నిరసన దీక్షకు జేసీ దివాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదని.. రాష్ట్ర ప్రజలందరిదీ అని అన్నారు. ఏడు నెలలుగా విజయసాయి రెడ్డి దిల్లీ, విశాఖకు తిరుగుతూనే ఉన్నారని విమర్శించారు.
గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తీసుకొచ్చిన పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ ప్రజల్లో నమ్మకాన్ని పోగొట్టుకున్నారని దివాకర్ రెడ్డి అన్నారు. రాజధాని ఉంటే అమరావతిలో ఉండాలని... ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు చేస్తున్న శాంతి పోరాటం అన్ని సమయాల్లో సరికాదన్నారు. మహిళలపై దాడులు దారుణమని వాపోయారు. ఈ నెల 23న ఐకాస సమావేశమై కార్యాచరణ రూపొందిస్తుందని వెల్లడించారు.
ఇదీ చదవండి