ETV Bharat / city

కేంద్ర జలశక్తి శాఖతో దక్షిణాది రాష్ట్రాల సదస్సు - జలశక్తి శాఖతో దక్షిణాది రాష్ట్రాల సదస్సు

సాగు, తాగునీటితో పాటు పారిశుద్ధ్య అంశాలపై కేంద్ర జలశక్తి శాఖమంత్రి గజేంద్ర షెకావత్ హైదరాబాద్​లో ఇవాళ ..దక్షిణాది రాష్ట్రాల ఉన్నతాధికారులతో సదస్సు నిర్వహించనున్నారు.

కేంద్ర జలశక్తి శాఖతో దక్షిణాది రాష్ట్రాల సదస్సు
author img

By

Published : Nov 11, 2019, 9:07 AM IST

హైదరాబాద్​లో నేడు నీటి పారుదలతో పాటు పారిశుద్ధ్య అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ సదస్సు నిర్వహించనుంది, ఆంధ్రప్రదేశ్,. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులతో జరగనున్న సదస్సులో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్ పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం గురించి చర్చించనున్నారు. తమిళనాడులో తాగునీటి సమస్య, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల అంశంపై కూడా చర్చించే అవకాశాలున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ఇవాళ అధికారులు ప్రస్తావించనున్నారు.

ఇదీ చదవండిః జలశక్తి అభియాన్​లో మహబూబ్​నగర్​దే​ మొదటి స్థానం

TG_Hyd_03_11_Jalashakthi_meeting_Dry_3053262 From : Raghu vardhan ( ) సాగునీరుతో పాటు తాగునీరు, పారిశుద్ధ్య అంశాలపై కేంద్ర జలశక్తి శాఖ ఇవాళ హైదరాబాద్ ల్లో దక్షిణాది రాష్ట్రాల సదస్సు నిర్వహించనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులతో నిర్వహించనున్న సదస్సులో కేంద్ర జలశక్తిశాఖా మంత్రి గజేంద్ర షెకావత్ పాల్గొననున్నారు. నీటిపారుదల అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న నదుల అనుసంధానం కూడా ప్రస్తావనకు రానుంది. తమిళనాడులో తాగునీటి సమస్యపై, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య కావేరీ నదీ జలాల అంశంపై కూడా సదస్సులో చర్చ జరిగే అవకాశం ఉంది. తాగునీటి అవసరాలు, పారిశుధ్య సంబంధిత అంశాలపై కూడా సదస్సులో చర్చించనున్నారు. సదస్సు నేపథ్యంలో సీఎస్ జోషి, నీటిపారుదల ఈఎన్సీ మురళీధర్ తో శనివారం సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రం తరపున ప్రస్తావించాల్సిన అంశాలపై దిశానిర్ధేశం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.