జగన్ వచ్చారని... వరుణుడు పారిపోయాడా అంటూ తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. సాగునీరు రాక ఉత్తరాంధ్ర ఉసూరుమంటుంటే.. చినుకు రాలక రాయలసీమ రాళ్లసీమలా కనిపిస్తోందని అన్నారు. గుక్కెడు నీటి కోసం ప్రకాశం ప్రజలు రోడ్డెక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ వల్లే వానొచ్చిందని, వరదొచ్చిందంటూ వైకాపా నేతలు జగన్ను భగీరథుడు అంటూ... దర్పం ప్రదర్శిస్తున్నారంటూ లోకేష్ తప్పుబట్టారు. ఇప్పటి వరకు 3 జిల్లాల్లో సాధారణ, 10 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించారు. చాలా ప్రాంతాలలో తాగేందుకు నీరు కావాలంటూ జనాలు ఆందోళనకు దిగుతున్నారని గుర్తు చేశారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యారని తెలిసి వరుణుడు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాడా ? అన్న ప్రశ్నకు వైకాపా మేధావులే సమాధానం చెప్పాలన్నారు.
ఇదీ చదవండి