ETV Bharat / city

రాష్ట్రంలో అన్ని బార్ల లైసెన్సులు రద్దు... ఉత్తర్వులు జారీ

మద్యపాన నిషేధం దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది. ప్రస్తుతమున్న అన్ని బార్ల లైసెన్సులు రద్దు చేస్తూ... ఉత్తర్వులు జారీ చేసింది. 40 శాతం బార్లు తగ్గించి... మళ్లీ లైసెన్సులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

cm jagan
author img

By

Published : Nov 22, 2019, 5:44 PM IST

రాష్ట్రంలోని అన్ని బార్ల లైసెన్సులనూ రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ఎక్సైజ్​ చట్టం 1968లోని సెక్షన్ 32 ప్రకారం బార్ లైసెన్సులను వాపసు తీసుకుంటున్నట్టు రెవెన్యూ శాఖ ఈ ఆదేశాలను విడుదల చేసింది. అలాగే 40 శాతం మేర బార్లను తగ్గించి కొత్త లైసెన్సులు జారీ చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 830 బార్ లైసెన్సులు ఈ ఉత్తర్వులతో రద్దు అయ్యాయి. 38 నక్షత్ర హోటళ్లు, 4 మినీ బ్రూవరీస్ మినహా అన్ని లైసెన్సులనూ ప్రభుత్వం రద్దు చేసింది. మద్య నిషేధ కార్యక్రమం అమల్లో భాగంగా 40 శాతం మేర కుదించి కొత్త లైసెన్సులను జారీ చేయనున్నారు.

లైసెన్సు ఫీజు భారీగా పెంపు

బార్ లైసెన్సులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం కొత్త బార్ పాలసీని కూడా ప్రకటిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. 2020 జనవరి 1వ తేదీ నుంచి ఈ బార్ పాలసీ అమలు కానుంది. రెండేళ్ల కాలపరిమితితో ఈ లైసెన్సులు జారీ కానున్నాయి. కొత్త విధానం ప్రకారం లైసెన్సు ఫీజును 10 లక్షల రూపాయలుగా నిర్ధరిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. లాటరీ ద్వారా మాత్రమే బార్ల కేటాయింపులు జరుగుతాయని స్పష్టం చేసింది. అలాగే ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ మాత్రమే బార్లు పనిచేయాల్సి ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. వీటితో పాటు బార్లలో మద్యం అమ్మకాలపై అదనపు పన్నును విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

ఇవీ చదవండి

పరిహారం కోసం 'సజీవ సమాధి'తో రైతుల నిరసన

జనవరి లేదా ఫిబ్రవరి నుంచి రచ్చబండ.. సీఎం జగన్​ నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.