ETV Bharat / city

ఆకాశాన్నంటుతున్న ఉల్లి ధరలు.. అమ్ముకోలేని స్థితిలో రైతన్న - Increase in onion prices in Andhrapradesh state news

ఉల్లి ధర ఉలిక్కి పడేలా చేస్తోంది. రోజురోజుకూ ధర పెరుగుతోంది. రైతు బజార్లలో కిలో రూ.36 చొప్పున పలుకుతుంటే బయట మార్కెట్​లో రూ. 50 నుంచి రూ. 75 వరకు పలుకుతోంది. పెరిగిన ధరలను కట్టడి చేసేందుకు  కేంద్రం ఉల్లి దిగుమతులపై దృష్టి పెట్టింది. మరోవైపు పండించిన ఉల్లిని అమ్ముకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Increase in onion prices in Andhrapradesh state
author img

By

Published : Nov 11, 2019, 12:16 PM IST

Updated : Nov 11, 2019, 12:26 PM IST

రాష్ట్రంలో ఉల్లి ధర అంతకంతకూ పెరుగుతోంది. రైతుబజార్లలో కిలో రూ.36 చొప్పున పలుకుతుంటే బయట మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.75 వరకు పలుకుతోంది. వినియోగదారుల కష్టాలిలా ఉంటే.. మరోవైపు పండించిన ఉల్లిని అమ్ముకోలేక రైతులు ఇబ్బంది పడుతున్నారు. కర్నూలు యార్డుకు వస్తే నాలుగైదు రోజులు నిరీక్షించాల్సి వస్తోంది. ఈనెల 11 దాకా సరుకు తేవద్దని.. అవసరమైతే తాడేపల్లిగూడెం, హైదరాబాద్‌కు తీసుకెళ్లి అమ్ముకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఉల్లి దిగుమతుల దిశగా ..
మహారాష్ట్ర, కర్ణాటకలో ఉల్లి సాగు భారీగా దెబ్బతింది. కొన్నేళ్లలో ఎప్పుడూ లేనంత తక్కువ సరకు మార్కెట్‌కు వస్తోంది. ధరలు కట్టడి చేసే చర్యల్లో భాగంగా కేంద్రం ఉల్లి దిగుమతులపై దృష్టి పెట్టింది. ఈజిప్టు, టర్కీ, ఇరాన్‌ నుంచి తెప్పించే దిశగా చర్యలు చేపడుతోంది. ఈ ఉల్లి మార్కెట్‌లోకి వస్తే ధరలు తగ్గే అవకాశం ఉంది.

ఆదివారం నుంచి రైతుబజార్లలో
మార్కెట్‌లో ఉల్లి ధర కిలోకు రూ.5 నుంచి రూ.10 వరకు పెరిగింది. గతంలో మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఉల్లి తెప్పించి కిలో రూ.25 చొప్పున రైతుబజార్లలో విక్రయించారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఆదివారం నుంచి రైతుబజార్లలో ఉల్లి అమ్మకాలకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న తెలిపారు. కర్నూలు యార్డులో కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

వేలంలో జాప్యం
కొద్ది రోజులుగా కర్నూలు మార్కెట్‌కు భారీగా సరకు వస్తోంది. ఇప్పటికే 80 లారీల సరుకు నిల్వ ఉంది. యార్డు సామర్థ్యానికి మించి సరకు వస్తుండటంతో కొన్న వెంటనే తరలించలేకపోతున్నారు. దీంతో వేలంలో జాప్యమేర్పడి విక్రయాలకు నాలుగైదు రోజులు పడుతోంది. నాణ్యత తగ్గిందంటూ ధరలు తగ్గించేస్తున్నారు. గురువారం క్వింటాకు రూ.2వేల నుంచి రూ.4వేల వరకు లభించింది.

ప్రస్తుతం ధరలు బాగుండటంతో పెద్ద మొత్తంలో సరకు వస్తోంది. ఆలస్యమైతే ధరలు తగ్గుతాయేమోననే ఆందోళన రైతులను వెన్నాడుతోంది. ఎమ్మిగనూరులోనూ కేంద్రం ఏర్పాటు చేసి కొంటే రైతులకు అనుకూలంగా ఉంటుంది. అక్కడ మార్కెటింగ్‌ శాఖనే కొనుగోలు చేసి రైతుబజార్లకు తరలించవచ్చు. ఇలా చేస్తే కర్నూలు యార్డుపై ఒత్తిడి తగ్గుతుంది.

కర్నూలు, డోన్‌, కోడుమూరు, గూడూరు, కడప జిల్లా మైదుకూరు ప్రాంతాల్లో ఉల్లి నిల్వల గిడ్డంగులున్నాయి. ఇందులో 900 మెట్రిక్‌ టన్నులను నిల్వ చేసే అవకాశం ఉంది. అవసరమైతే మార్కెటింగ్‌ శాఖ రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని ఇక్కడ నిల్వ చేయవచ్చు. రైతుబజార్ల ద్వారా విక్రయించవచ్చు.

ఇదీ చదవండి : సిడ్నీ నగరంలో ఘనంగా వనభోజనాలు

Intro:Body:

taza sklmtaza sklmtaza sklm

Conclusion:
Last Updated : Nov 11, 2019, 12:26 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.