ETV Bharat / city

నేటి నుంచి 'వైఎస్సార్‌ నవశకం' పేరిట సర్వే - house survey in andhrapradesh

'వైఎస్సార్‌ నవశకం' పేరిట నేటి నుంచి ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. డిసెంబర్‌ 20 వరకు గ్రామ, వార్డు వాలంటీర్లు సర్వే చేయనున్నారు. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించేందుకు... కొత్త పథకాల అర్హుల జాబితానూ సిద్ధం చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టారు.

నేటి నుంచి 'వైఎస్సార్‌ నవశకం' పేరిట సర్వే
author img

By

Published : Nov 20, 2019, 5:34 AM IST

అర్హులందరికీ నవరత్నాలు అందించే లక్ష్యంతో 'వైఎస్సార్ నవశకం' పేరిట... గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం నేటి నుంచి ఇంటింటి సర్వే చేపట్టనుంది. డిసెంబర్‌ 20 వరకూ సర్వే చేసిన అనంతరం... డిసెంబర్‌ 21 నుంచి 31 వరకూ సమాచారాన్ని మండల స్థాయిలో కంప్యూటరీకరణ చేస్తారు. జనవరి 2 నుంచి 7 వరకూ అనర్హుల గుర్తింపు, పునఃపరిశీలన జరపనున్నారు. 8న అర్హుల జాబితా ముద్రించి... 9వ తేదీన గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించనున్నారు. జనవరి 11 నుంచి 13 వరకూ అభ్యంతరాలు, ఫిర్యాదులు స్వీకరిస్తారు. 15 నుంచి 18 వరకూ గ్రామ సభలు నిర్వహించి ఫిర్యాదులు పరిశీలించనున్నారు. ఈ సర్వే పూర్తయ్యాక... రేషన్‌ బియ్యానికి ఓ కార్డు, సామాజిక పింఛన్లు పొందేందుకు మరొకటి, కుటుంబానికో ఆరోగ్యశ్రీ కార్డు విడివిడిగా ఇవ్వనున్నారు. రేషన్‌ బియ్యానికి విడిగా కార్డులు ఇవ్వడం వల్ల... అక్రమ దందాకు అడ్డుకట్ట పడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. ఇవే కాకుండా... కొత్తగా అమలు చేయబోయే పథకాలకు అర్హులను గుర్తించి, ఆయా పథకాలకు సంబంధించి విడివిడిగా కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

అమ్మఒడి, నైపుణ్య కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ, పోటీ పరీక్షల శిక్షణకు హాజరయ్యేలా జగనన్న విద్యాకార్డును ప్రభుత్వం అందించనుంది. ప్రభుత్వ వసతిగృహాల్లో ఉంటున్నవారికి జగనన్న వసతి దీవెన కార్డు ఇవ్వనుంది. వైఎస్సార్ మత్స్యకార భరోసా, నేతన్న నేస్తం, కాపునేస్తం, సున్నావడ్డీ పథకం, అమ్మఒడి, దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులు, ఇమామ్స్‌, మోర్జమ్స్‌, పాస్టర్‌లకు ఆర్థికసాయానికి అర్హులను గుర్తించనున్నారు. వాలంటీర్లు రోజుకు కనీసం 5 ఇళ్ల సర్వే అయినా చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వైఎస్సార్ నవశకం పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి... ఆయా జిల్లాల అధికారులు ఇప్పటికే గ్రామ, వార్డు వాలంటీర్లకు మార్గ దర్శకాలు జారీ చేశారు.

ఇవీ చూడండి:

'కేసులు పరిష్కారమయ్యాకే డీఎస్సీ నోటిఫికేషన్'

AP_GNT_06_19_TODAY_ONWARDS_HOUSEHOLD_SURVEY_PKG_3067949 REPORTER: P.SURYA RAO Anchor: వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారుల పరిశీలన, కొత్త కార్డుల జారీకి సంబంధించి నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించి అనర్హుల తొలగింపుతోపాటు.... అర్హులందరికీ కొత్త కార్డులను జారీ చేసేందుకు రాష్ట్రప్రభుత్వం వైఎస్సాఆర్ నవశకం పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మరో ఏడు కొత్త పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు సర్వే నిర్వహించనున్నారు. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా డిసెంబర్ 20 వరకు ఈ సర్వే జరగనుంది....LOOK..... V.O.1: రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి ఇంటింటి సర్వే కోసం ప్రభుత్వం భారీ కసరత్తు చేపట్టింది. వైఎస్సార్‌ నవశకం' పేరుతో గ్రామ, వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్లి సర్వే చేయాలని తలపెట్టారు. నవరత్నాలను పేదలందరికీ అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. వీటిలో కొత్తగా రేషన్‌ బియ్యం కార్డు, సామాజిక పింఛన్లు పొందేందుకు మరో కార్డు, ప్రతి కుటుంబానికి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి 5లక్షల ఆదాయాన్ని గరిష్ట పరిమితిగా విధించారు. ప్రభుత్వ అధికారులు, ఇన్‌కం ట్యాక్సు పేయర్లు కాకుండా మిగతా వారంతా రూ.5 లక్షల్లోపు ఆదాయం ఉంటే ఈ కార్డు పొందవచ్చని అధికారులు తెలిపారు. కుటుంబంలో ఎవరికైనా ఒక కారు ఉన్నా ఆరోగ్య శ్రీకి అర్హులే. వీటితో పాటు జగనన్నవిద్యా దీవెన ద్వారా అమ్మఒడి, ఇతర స్కాలర్‌షిప్‌లు, నైపుణ్య కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ, పోటీ పరీక్షలకు శిక్షణకు హాజరయ్యేలా ఈ కార్డును అందిస్తారు. జగనన్న వసతి దీవెన కార్డు ద్వారా ప్రభుత్వ వసతిగృహాల్లో వసతి పొందుతున్న విద్యార్థులకు ఈ కార్డు అందిస్తారు. విద్యా, వైద్య, సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రస్తుతం తెల్లరేషన్‌ కార్డులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. బియ్యం తీసుకోకపోయినా చాలా మందికి తెల్లరేషన్‌ కార్డులు ఉన్నాయని... బియ్యం కార్డులు విడిగా ఇవ్వడం వల్ల అవసరమైన వారే తీసుకుంటారని భావిస్తున్నారు. దీని వల్ల రేషన్‌ అక్రమ వ్యాపారానికి బ్రేక్‌ పడుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఆరోగ్యశ్రీ కోసం చాలామంది తెల్లకార్డులను తమ దగ్గర ఉంచుకుంటున్నారు. ఇకపైన 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ ఆదాయ పరిమితిని పెంచనుండటంతో రేషన్ కార్డుల అవసరం, ప్రభుత్వంపై రాయితీభారం కొంతమేరకు తగ్గే అవకాశముంది. డిసెంబర్ 20 వరకు నెల రోజులపాటు సర్వే నిర్వహించనుండగా.. డిసెంబరు 21 నుంచి 31 వరకు సమాచారాన్ని మండలస్థాయిలో కంప్యూటరీకరణ చేస్తారు. జనవరి 2 నుంచి 7 వరకు అనర్హుల గుర్తింపు, పున:పరిశీలన జరపనున్నారు. 8న అర్హుల జాబితా ముద్రించనున్నారు. జనవరి 9న గ్రామ, వార్డు సచివాలయాల వద్ద జాబితాలను ప్రదర్శిస్తారు. జనవరి 11 నుంచి 13 వరకు అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ, 15 నుంచి 18 వరకు గ్రామసభలను నిర్వహించనున్నారు. గ్రామ,వార్డు వలంటీర్లకు ఇప్పటికే శిక్షణ అందించిన అధికారులు... కనీసం రోజుకు 5 ఇళ్ల నుంచి సర్వే సమాచారాన్ని సేకరించనున్నారు. మండల, జిల్లాస్థాయిలో పర్యవేక్షణ అధికారులను నియమించారు...SPOT.... BYTE: శామ్యూల్ ఆనంద్ కుమార్, గుంటూరు కలెక్టర్ V.O.2: ఈ కీలక సర్వేలో ప్రభుత్వం నూతనంగా అమలు చేయనున్న 7 కొత్త పథకాలకు అర్హులను కూడా గుర్తిస్తారు. వైఎస్సార్ మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, వైఎస్సార్ సున్నావడ్డీ పథకం, అమ్మ ఒడి పథకం, దర్జీలు, రజకులు, నాయీబ్రాహ్మణులకు ఆర్థికసాయం, వైఎస్సార్ కాపునేస్తం కింద 45 ఏళ్లు దాటిన స్వయంసహాయక మహిళలకు ఆర్థికసాయం, ఇమామ్స్, మోర్జమ్స్, ఫాస్టర్స్ లకు ఆర్థికసాయం వంటి పథకాలకు సర్వే ద్వారా అర్హులను గుర్తిస్తారు. ...BYTE.... BYTE: శామ్యూల్ ఆనంద్ కుమార్, గుంటూరు కలెక్టర్ E.V.O.: ప్రత్యేక సర్వేపై చేయడం వల్ల బోగస్‌ కార్డులు బయటపడే అవకాశముంది. అదే సమయంలో సర్వే పేరుతో కొందరి కార్డులను తొలగిస్తారన్న ఆందోళన లేకపోలేదు. క్షేత్రస్థాయి సర్వేలో ఏమాత్రం లోపాలు చోటుచేసుకున్నా.. రాజకీయ అంశాలు మిళితమైనా... అర్హులైన పేదలకు నష్టం వాటిల్లే ప్రమాదమున్నందున సర్వే నిర్వహణ కీలకంగా మారింది......END.....
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.