బార్ లైసెన్సుల రద్దుపై హైకోర్టులో విచారణ - ఏపీ బార్ లైసెన్స్ రద్దు న్యూస్
లైసెన్సులు రద్దు చేస్తూ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ... బార్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 18కి విచారణను వాయిదా వేసింది.
high court on bars owners petition
దశల వారీ మద్య నిషేధ ఉద్దేశం నిజంగా ఉంటే బార్ల తరహాలోనే రిటైల్ మద్యం దుకాణాలు ఎందుకు తగ్గించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే దుకాణాలు తగ్గించకుండా బార్ల సంఖ్యను తగ్గిస్తే ప్రయోజనం ఏంటని నిలదీసింది.నూతన బార్ల విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రంలోని కొందరు బార్, రెస్టారెంట్ యజమానులు దాఖలు చేసిన వ్యాజ్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది.2022 జూన్ 30 వరకూ బార్లు నిర్వహించుకునేందుకు 2017లో లైసెన్సులు మంజూరు చేసిన ప్రభుత్వం.. ఏకపక్షంగా తమ లైసెన్సులు రద్దు చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టులో అభ్యంతరం తెలిపారు. ఐతే బార్ల లైసెన్సులు ఉపసంహరించుకునే అధికారం ప్రభుత్వానికి ఉందనిఅడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు. దశల వారీగా మద్యాన్ని నిషేధించాలనే ఉద్దేశంతో బార్ల దరఖాస్తు రుసుమును భారీగా పెంచామని వివరించారు. గతంలో ఉన్న 780 బార్లును 40 శాతం కుదించి 487కు పరిమితం చేస్తున్నట్లు తెలిపారు. ఇదేసమయంలో 4వేల380 మద్యం దుకాణాలను 3వేల500లకు తగ్గించామన్నారు. ఐతే ఒక వైపు మద్య నిషేధం అంటూ మరోవైపు ఆదాయం సమకూర్చుకునేలా కొత్త బార్ల కేటాయింపు పేరుతో ధరఖాస్తుకు 10 లక్షలు వసూలు చేయాల్సిన అవసరం ఏముందని ధర్మాసనం ప్రశ్నించింది. దశల వారీగా మద్య నిషేధం తీసుకురావాలనే ఉద్దేశం నిజంగా ఉంటే బార్ల సంఖ్యను 40శాతం కుదించినట్లే..... 'రిటైల్ మద్యం దురాణాల విషయంలో ఎందుకు తగ్గించలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. సామాన్య ప్రజలకు తక్కువ ధరలో సులభంగా మద్యం లభ్యమయ్యే దుకాణాల సంఖ్యను తగ్గించకుండా బార్ల సంఖ్యను తగ్గిస్తే ప్రయోజనం ఏముంటుందని ఘాటుగా వ్యాఖ్యానించింది. నూతన బార్ల విధానంపై ముందు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత నిబంధనలు రూపొందించడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. కొత్త బార్ల ఎంపిక కోసం ఈనెల 7న నిర్వహించాల్సిన ప్రక్రియను 15వ తేదీ వరకు వాయిదా వేస్తున్నామని అడ్వకేట్ జనరల్ తెలుపగా తదుపరి విచారణను ధర్మాసనం ఈ నెల 18కి వాయిదా వేసింది.

Intro:Body:Conclusion:
Last Updated : Dec 4, 2019, 5:50 AM IST