గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్ర ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ శుభదినాన భక్తుల సమస్యలు తొలగిపోయి... వారి ప్రయత్నాలు విజయవంతమయ్యేలా వినాయకుడు ఆశీర్వదించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. ప్రజలంతా శాంతి, సామరస్యాలతో జీవించేలా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నట్టు బిశ్వభూషణ్ హరిచందన్ తెలిపారు.
ఇదీ చదవండీ...పవన్ ద్వంద్వ వైఖరి మార్చుకో: బొత్స