ETV Bharat / city

గోదావరి నుంచి కృష్ణా పెన్నా నదులకు వరద జలాలు - 5 మార్గాల ఆలోచన తాజా వార్తలు

పోలవరం నుంచి గోదావరి వరద జలాలను కర్నూలు జిల్లాలోని బనకచర్ల రెగ్యులేటర్‌తో అనుసంధానించేందుకు వ్యాప్కోస్‌ సంస్థ అయిదు ప్రత్యామ్నాయ మార్గాలను సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి వ్యాప్కోస్‌ నివేదిక ఇచ్చింది. సీఎం సమీక్ష తర్వాత అసలు మార్గం ఎంపిక చేయనుంది. ఆ తరువాత డీపీఆర్..ఆపై టెండర్లు పిలవనుంది.

water
water
author img

By

Published : Dec 4, 2019, 8:01 AM IST

రాష్ట్ర ప్రభుత్వం గోదావరి వరద జలాలను బనకచర్ల రెగ్యులేటర్‌ వద్దకు చేర్చి... అటు రాయలసీమ జిల్లాలకు, ఇటు పెన్నాకు తరలించేలా వీలుగా కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వ్యాప్కోస్‌కు డీపీఆర్‌ తయారీ బాధ్యతలు అప్పగించారు. గోదావరి-బనకచర్ల అనుసంధానానికి నీరు మళ్లింపు మార్గాలపై వ్యాప్కోస్‌ అయిదు ప్రత్యామ్నాయాలతో ప్రాథమిక నివేదిక రూపొందించి తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. అయిదో ప్రత్యామ్నాయంలో భాగంగా మూడు వేర్వేరు ప్రతిపాదనలు కూడా చేసింది.

ఈ వారంలో ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వద్ద ఈ అంశంపై సమీక్షించనున్నారని సమాచారం. సీఎం అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకున్నాక తుది అలైన్‌మెంట్‌ను ఖరారు చేయనున్నారు. వీలైనంత త్వరగా డీపీఆర్‌ పూర్తి చేసి టెండర్లు పిలవాలని జలవనరులశాఖ భావిస్తోంది. గోదావరి నీటిని కృష్ణాలో కలుపుతూ మళ్లించేలా కొన్ని ప్రత్యామ్నాయాలు, కృష్ణా నదిలో కలవకుండానే అక్విడక్టు నిర్మించి నేరుగా బనకచర్లకు మళ్లించేలా కొన్ని ప్రత్యామ్నాయాలను వ్యాప్కోస్‌ సూచించింది.

ప్రత్యామ్నాయం

1: కృష్ణా నదిలో కలపకుండానే బనకచర్లకు మళ్లింపు

గోదావరి నుంచి వరద కాలంలో టన్నెళ్లు, గ్రావిటీ కాలువ ద్వారా నీటిని మళ్లిస్తారు. కృష్ణా నదిపై చింతపల్లి వద్ద అక్విడక్టు నిర్మించి అక్కడి నుంచి బొల్లాపల్లి వద్ద జలాశయం నిర్మించి తరలిస్తారు. అక్కడి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు మళ్లిస్తారు. ఈ మార్గంలో టన్నెల్‌ నిర్మాణమూ అవసరమవుతుంది. ఆరు చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదనలో మొత్తం 560 కిలోమీటర్ల మేర నీటిని తరలిస్తారు. 9,149 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు అవసరం అవుతుంది.

  • అంచనా వ్యయం: రూ.61,302 కోట్లు (రోజుకు 2 టీఎంసీలు తరలిస్తే), రూ. 68,924 కోట్లు (రోజుకు 3 టీఎంసీలు తరలిస్తే).

2: కృష్ణా నదిలో కలపకుండా సాగర్‌ కుడి కాలువ సాయంతో మళ్లింపు

గోదావరి నుంచి కృష్ణా నదిని దాటే వరకు తొలి ప్రతిపాదన తరహాలోనే నీటి మళ్లింపు ఉంటుంది. వైకుంఠపురం బ్యారేజి ప్రాంతానికి ఎగువన అక్విడక్టు నిర్మించి నీటిని దాటిస్తారు. ఈ ప్రాంతం నుంచి గోదావరి వరద నీటిని ప్రస్తుతం ఉన్న సాగర్‌ కుడి కాలువకు మళ్లిస్తారు. ఎత్తిపోతల పథకాలు, గ్రావిటీ కాలువ ద్వారా తరలింపు ఉంటుంది. అక్కడి నుంచి బొల్లాపల్లి జలాశయానికి, అక్కడ నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలిస్తారు. మొత్తం 535 కిలోమీటర్ల పొడవునా కాలువలు, ఎత్తిపోతలు, పైపులైన్లు ఉంటాయి. మొత్తం 9 చోట్ల నీటిని ఎత్తిపోయాలి.

  • అంచనా వ్యయం: రూ.64,700 కోట్లు (రోజుకు 2 టీఎంసీలు); రూ.68,998 (రోజుకు 3 టీఎంసీలు తరలిస్తే).

3: కృష్ణా నదిలో గోదావరి జలాలు కలుపుతూ బనకచర్లకు మళ్లింపు

కృష్ణా నదిపై పుట్టగూడెం వద్ద కొత్తగా బ్యారేజిని నిర్మించి తరలించిన గోదావరి నీటిని నింపుతారు. ఆ నీరు పులిచింతల ప్రాజెక్టు వరకు విస్తరిస్తుంది. అక్కడి నుంచి బుగ్గవాగు జలాశయంలోకి మళ్లిస్తారు. అక్కడి నుంచి ప్రస్తుతం ఉన్న నాగార్జునసాగర్‌ కుడి కాలువ ద్వారా నీటిని తరలిస్తారు. ఈ మార్గంలోనే కొన్ని చోట్ల నీటిని ఎత్తిపోస్తూ కొత్తగా నిర్మించనున్న బొల్లాపల్లి జలాశయానికి... అక్కడి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు చేరుస్తారు. ఈ మార్గం పొడవు: 540 కిలోమీటర్లు ఉంటుంది.

  • అంచనా వ్యయం: రూ.74,679 కోట్లు (రోజుకు 2 టీంఎసీలు తరలిస్తే), రూ.:81,309 కోట్లు (రోజుకు 3 టీఎంసీలు తరలిస్తే)

4: వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మించి...

ఈ ప్రతిపాదనలో... వైకుంఠపురం వద్ద బ్యారేజి నిర్మించి, ఆ దిగువన కృష్ణా నదిలో మునేరు కలిసే చోట గోదావరి నీరు కలుస్తుంది. అక్కడి నుంచి ఎత్తిపోతల, గ్రావిటీ ద్వారా సాగర్‌ కుడి కాలువకు చేర్చి తిరిగి బొల్లాపల్లి జలాశయంలో నింపుతారు. ఆ తర్వాత పైన ప్రతిపాదించిన మార్గాల్లోనే బనకచర్ల రెగ్యులేటర్‌కు చేరుస్తారు. ఈ మార్గం పొడవు... 540 కిలోమీటర్లు ఉంటుంది.

  • అంచనా వ్యయం: రూ.63,763 కోట్లు (రోజుకు 2 టీఎంసీలు తరలిస్తే); రూ.70,831 కోట్లు (రోజుకు 3 టీఎంసీలు తరలిస్తే)

5ఎ : పోలవరం కుడి కాలువను విస్తరించి...

ఈ విధానంలో గోదావరి నుంచి కృష్ణా వరకు కొత్తగా కాలువ తవ్వరు. ప్రస్తుతం ఉన్న పోలవరం కుడి కాలువను ఆధునికీకరించి నీటి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచుతారు. అక్కడి నుంచి ప్రతిపాదిత వైకుంఠపురం బ్యారేజిలోకి నీటిని తరలిస్తారు. ఆ తర్వాత బొల్లాపల్లి జలాశయానికి, బనకచర్ల రెగ్యులేటర్‌కు తీసుకెవెళ్తారు. ఈ మార్గంలో 9చోట్ల ఎత్తిపోతలు నిర్మిస్తారు.

  • అంచనా వ్యయం: రూ.63,535 కోట్లు

5బి : ఈ ప్రతిపాదనలో... పైన పేర్కొన్న పోలవరం కుడి కాలువను ఆనుకుని కొత్తగా రోజుకు అర టీఎంసీ నీటిని తరలించేలా ప్రస్తుత కాలువకు సమాంతరంగా కొత్త కాలువ తవ్వుతారు. మిగిలిన అన్ని అంశాలు 5(ఎ) ప్రతిపాదనలో ఉన్నట్లు ఉంటాయి.

  • అంచనా వ్యయం: రూ.62,429 కోట్లు

5సి: ప్రస్తుతం ఉన్న పోలవరం కుడి కాలువకు సమాంతరంగా కొత్త కాలువ తవ్వుతారు. రోజుకు 2 టీఎంసీలు మళ్లించేలా ఆ కాలువ ఉంటుంది. మిగిలిన అంశాలన్నీ 5 బి ప్రతిపాదనలో ఉన్నట్లే ఉంటాయి.

  • అంచనా వ్యయం: రూ. 68,177 కోట్లు.

ఇవి కూడా చదవండి:

నేడు నౌకాదళ దినోత్సవం... విశాఖ తీరాన అబ్బురపరుచనున్న విన్యాసాలు

Intro:Body:

taza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.