మూడు రాజధానుల ప్రతిపాదన ఖర్చుతో కూడుకుందని ఎంపీ గల్లా జయదేవ్ అభిప్రాయపడ్డారు. రాజకీయం కోసం రాజధానిని వికేంద్రీకరించే ఆలోచన మంచిది కాదని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రభుత్వ భవనాలు నిర్మించడం కాదన్నారు. మూడు రాజధానులకు మంత్రులు, అధికారులు తిరగటం వ్యయప్రయాసలతో కూడుకుంది అని గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికాకు 3 రాజధానులు ఆర్థిక భారమని ప్రస్తుత అధ్యక్షుడు చెప్పారని తెలిపారు.పెట్టుబడులు ఆకర్షించేందుకు ఒకే రాజధాని ఉండాలని... అమరావతి తప్పకుండా పెట్టుబడులను ఆకర్షించే నగరంగా ఉంటుందని గల్లా జయదేవ్ అన్నారు. వాగ్దానాలు విస్మరిస్తే భవిష్యత్తులో ఎక్కడా భూములు ఇచ్చేందుకు రైతులు రారని హెచ్చరించారు.
ఇదీ చదవండి