ETV Bharat / city

ప్రభుత్వం ఉందనే భరోసా రైతులకివ్వాలి: సీఎం - CM jagan

కౌలుచట్టంపై రైతులకు, కౌలు రైతులకు వాలంటీర్లతో అవగాహన కల్పించాలిని ముఖ్యమంత్రి జగన్​ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ మిషన్​పై సమీక్ష నిర్వహించిన ఆయన నాణ్యమైన విత్తనాలను, ఎరువులను రైతులకు అందజేసి సరైన గిట్టుబాటు ధర కల్పించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష
author img

By

Published : Aug 14, 2019, 9:59 PM IST

ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష

వ్యవసాయ మిషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌.. మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. కౌలుచట్టంపై రైతులకు, కౌలురైతులకు వాలంటీర్లతో అవగాహన కల్పించాలని సూచించారు. గ్రామ సచివాలయాలు వచ్చాక రైతుల పథకాలు స్థిరీకరణ అవుతాయన్నారు. ప్రతి నియోజకవర్గంలో అగ్రి ల్యాబ్స్‌ పెట్టాలని అధికారులను ఆదేశించారు.

నకిలీ విత్తనాలను చెక్!

విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను పరిశీలించిన తర్వాతే గ్రామాల్లోకి పంపాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. సరైనవే దుకాణాల్లో ఉండే విధంగా చర్యలు తీసుకోని నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే అమ్మే విధంగా చూడాలని ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్న సంస్థలు మాత్రమే వాటిని సరఫరా చేయాలన్నారు. దుకాణాల వద్ద రైతులకు అవగాహన కల్పించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు.

చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలి

కరవు ప్రాంతాల్లో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సీఎం జగన్ వ్యవసాయ అధికారులకు సూచించారు. వాటికి గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. సుబాబుల్, జామాయిల్‌ రైతులను ఆదుకోవడంపై అధికారుల నుంచి ముఖ్యమంత్రి సూచనలు కోరారు.అన్ని నియోజకవర్గాల నుంచి మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ రావాలన్నారు. ఎక్కడ రైతుకు ఇబ్బంది కలిగినా... ప్రభుత్వం ఉందనే భరోసా కలిగించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

లక్షా 2 వేల ఇళ్లకు రివర్స్‌ టెండరింగ్: సీఎం జగన్

Intro:ap_ong_63_14_dongalu_areste_avb_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

-------------------------------

ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో గత ఆరు నెలల నుంచి చోటుచేసుకుంటున్న దొంగతనాలు సంబంధించిన నిందితున్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 50 గ్రాముల వెండి,50 గ్రాముల బంగారు ఆభరణాలు మరియు రెండు గ్యాస్ సిలిండర్లు వంట సామాను స్వాధీనం చేసుకున్నారు

గత ఆరు నెలల నుంచి అద్దంకి శివారు ప్రాంతంలో నివసిస్తూ ఇంటికి తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న దర్యాప్తులో తెలిసింది. నేడు సింగరకొండ దేవస్థానం సమీపంలో అనుమానంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం బయటకు వచ్చిందని స్థానిక ఎస్ఐ శ్రీనివాసరావు తెలిపారు

bite : అద్దంకి ఎస్సై శ్రీనివాస రావు

Body:.

Conclusion:.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.