రాజధాని రైతుల పోరాటం.. బంద్ బాట పట్టింది. నిన్న పోలీసులు తమతో వ్యవహరించిన తీరుకు నిరసనగా.. మందడంలో ఉదయం నుంచి బంద్ పాటిస్తున్నారు. రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. పోలీసులకు సహాయాన్ని నిరాకరించారు. తాగునీరు సహా ఎలాంటి సౌకర్యాలు కల్పించరాదని నిర్ణయించారు. తమ దుకాణాల వద్ద పోలీసులు కూర్చోవటానికి వీల్లేదని స్థానిక వ్యాపారులు స్పష్టం చేశారు. తమ గ్రామం మీదుగా వెళ్లటానికి వీళ్లేదని పోలీసు వాహనాలను వెనక్కి పంపించేందుకు రైతులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా.. పోలీసులకు, రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం... తమకు సహకరించాలంటూ తుళ్లూరు డీఎస్పీ... రైతుల కాళ్లు పట్టుకున్నారు. కొంతమంది రైతులూ... తమ బంద్‌కు సహకరించాలని కోరుతూ పోలీసుల కాళ్లు పట్టుకున్నారు. దుకాణాలు తెరవనీయకుండా రైతులు బంద్ పాటిస్తున్నారు. రహదారి మొత్తం పరదా పరిచి రాకపోకలు స్తంభింపజేశారు.
రైతులు, పోలీసులు.. ఒకరి కాళ్లు మరొకరు పట్టుకున్నారు! - మందడంలో రైతుల పోరు ఉద్ధృతం వార్తలు
మహిళలపై పోలీసుల దౌర్జన్యం చేశారంటూ... రాజధాని రైతులు 'బంద్' చేస్తున్నారు. మందడంలో ఉదయం నుంచే బంద్ వాతావారణం కనిపిస్తోంది. దుకాణాలు తెరవనీయకుండా రైతులు బంద్ పాటిస్తున్నారు. రహదారి మొత్తం పరదా పరిచి రాకపోకలు నిలిపేశారు.