రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు దిగ్గజ సంస్థలు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. ఆయా పరిశ్రమలను రాష్ట్రానికి తెచ్చేలా పరిశ్రమల శాఖ సంప్రదింపులు జరుపుతోంది. ఇందులో కొన్ని కార్యరూపం దాల్చినా వేల కోట్ల విలువైన పెట్టుబడులు వేల మందికి ప్రత్యక్ష ఉపాధి లభించే అవకాశముంది. పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన వారిని పర్యవేక్షించే బాధ్యతను ఒక్కొక్క అధికారికి పరిశ్రమల శాఖ అప్పగించింది. అలాగే గత ప్రభుత్వ హయాంలో కుదుర్చుకున్న ఎంవోయూలపై ప్రత్యేక దృష్టి సారించింది.
స్టీలు రంగంలోనే లక్ష కోట్ల పెట్టుబడులు
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్టీల్, పేపర్, చెప్పుల తయారీ రంగంలో దిగ్గజ కంపెనీలతో సంప్రదిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న మౌలిక సదుపాయాల గురించి వారికి వివరిస్తున్నారు. ఒక్క స్టీలు రంగంలోనే రూ.లక్ష కోట్లకు పైనే పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి.
కంపెనీ | ఉత్పత్తి | పెట్టుబడి(రూ.కోట్లలో) | ఉపాధి లక్ష్యం |
హ్యుందాయ్ | స్టీల్ | 49,000 | - |
పోస్కో | స్టీల్ | 35,000 | 6,000 |
జేఎస్డబ్ల్యూ | స్టీల్ | 14,000 | - |
చింగ్షాన్ హోల్డింగ్స్ | స్టీల్ | 14,000 | 10,000 |
ఏషియా పల్స్ | పేపర్ | 19,000 | 4,000 |
ఇంటెలిజెంట్ | పాదరక్షలు | 700 | 10,000 |
ఏటీసీ టైర్స్ | టైర్లు | 1,152 | 1000 |
రిలయన్స్ ప్రొలిఫిక్ ట్రేడ్స్ | ఎలక్ట్రానిక్స్ | 212.79 | 3,750 |
గ్రాసిం ఇండస్ట్రీస్ | క్రోరో అల్కాలి | 2,700 | 1,300 |
పీఎస్ఏ వాల్సిన్ | గృహ నిర్మాణ చిప్స్ | 735 | - |
ఎలక్ట్రానిక్స్ రంగంలో ప్రముఖ పానాసోనిక్ రూ.వెయ్యి కోట్లు, ఫిలిప్స్ కార్బన్(బ్లాక్ కార్బన్) రూ. 600 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రెండు సంస్థలు 3,500 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదించాయి.
ఇదీ చదవండి: ముగిసిన లంక ఎన్నికలు..ఫలితాలపై భారత్, చైనా ఆసక్తి