ETV Bharat / city

ఉద్యోగాల పేరుతో అమాయకులకు టోకరా..! - arda fake website

ఉన్నతవిద్య అభ్యసించిన ఓ వ్యక్తి... పురోగతి దిశగా కాకుండా తిరోగమనం వైపుగా ఆలోచించాడు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి వేసిన ఉద్యోగాల పాచిక... కాస్త డబ్బు కళ్లజూసేలా అతనికి సహకరించింది. ఆ దురాలోచన కారణంగానే ఇప్పుడు అతని చుట్టూ ఉచ్చు బిగుస్తోంది.

ఉద్యోగాల పేరుతో అమాయకులకు టోకరా..!
author img

By

Published : Nov 9, 2019, 7:02 AM IST

ఉద్యోగాల పేరుతో అమాయకులకు టోకరా..!

రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పేరుతో ఓ నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించి... ఉద్యోగాల పేరుతో అమాయకులకు టోకరా వేశాడు ఓ యువకుడు. సీఆర్డీఏలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ... వారి నుంచి వేలల్లో నగదు వసూలు చేశాడు. డబ్బులు ఇచ్చినవారికి నమ్మకం కలిగించడం కోసం... ముఖాముఖి పరీక్షలూ నిర్వహించాడు. వారిలో కొందరు సీఆర్డీఏను ఆశ్రయించటంతో మోసం బయటపడింది.

సీఆర్డీఏ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ రూపొందించిన ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు... పొరుగు సేవల పద్ధతిలో ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో పత్రికా ప్రకటనలు ఇచ్చాడు. స్పందించిన కొందరు నిరుద్యోగులు... ఆ నకిలీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకున్నారు. వారిలో కొందరికి విజయవాడలో ముఖాముఖి నిర్వహిస్తున్నట్టు సందేశం పంపించాడు. విజయవాడలో 2 గదులు అద్దెకు తీసుకున్న అతగాడు... 15 మందిని ఇంటర్వ్యూ చేశాడు.

కొందరిని ఎంపికైనట్టు ప్రకటించి... వెబ్‌సైట్‌లోకి వెళ్లి తలో రూ.5వేల చొప్పున చెల్లించాలని చెప్పాడు. నమ్మిన నలుగురు యువకులు... డబ్బులు జమ చేశారు. అతనికి రూ.20వేలు ముట్టాయి. అయితే ఈ వ్యవహారంపై అనుమానం వచ్చిన కొందరు... సీఆర్డీఏ కార్యాలయంలో సంప్రదించారు. వెబ్‌సైట్‌ను తనిఖీ చేసిన అధికారులు... దాన్ని నకిలీదని నిర్ధరించారు. సీఆర్డీఏ కమిషనర్‌ లక్ష్మీనరసింహం... వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయాల్సిందిగా పోలీసులను కోరారు. దీనిపై గవర్నర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

ఈ విషయంపై గోప్యంగా విచారణ ప్రారంభించిన పోలీసులు... వెంటనే ఆ నకిలీ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేశారు. ఆ యువకుడి వివరాలు సేకరిస్తున్న పోలీసులు... ప్రకాశం జిల్లాకు చెందిన అతడు ఇంజినీరింగ్‌ మధ్యలోనే మానేసినట్టు గుర్తించారు. తనపై పోలీసుల నిఘా ఉందన్న అనుమానంతో... సదరు యువకుడు తన సిమ్‌ను కూడా ఆపేసినట్టు సమాచారం. అతణ్ని పట్టుకునేందుకు పోలీసు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి.

ఇదీ చదవండీ... ధారలు కట్టిన రక్తం మాటున... మాంసం ముద్దలు

Intro:Body:

taza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.